అచ్చెన్నాయుడి పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌ చేయండి: కోర్టు

ABN , First Publish Date - 2022-01-28T22:33:09+05:30 IST

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌

అచ్చెన్నాయుడి పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌ చేయండి: కోర్టు

విజయవాడ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌ చేయకపోవడంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుని అచ్చెన్న ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో రెన్యూవల్‌ చేయబోమని పాస్‌పోర్ట్‌ అధికారులు చెప్పారు. పిటిషన్‌పై వాదనలను లాయర్‌ గుడపాటి లక్ష్మీనారాయణ వినిపించారు. వాదనలు విన్న అనంతరం వెంటనే పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Read more