ఎమ్మెల్సీ అనంతబాబుకు 20 వరకూ రిమాండ్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-07T09:55:03+05:30 IST

కారు డ్రైవర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌కు ఈ నెల 20 వరకూ రిమాండ్‌ పొడిగించారు.

ఎమ్మెల్సీ అనంతబాబుకు  20 వరకూ రిమాండ్‌ పొడిగింపు

రాజమహేంద్రవరం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): కారు డ్రైవర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌కు ఈ నెల 20 వరకూ రిమాండ్‌ పొడిగించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జడ్జి ఎదుట హాజరుపరచగా, మరో 14 రోజులు రిమాండ్‌ విధించినట్టు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు తెలిపారు. 

Read more