సబ్‌ రిజిస్ట్రార్‌ల వద్ద రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2022-11-02T06:33:10+05:30 IST

ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌లతో పాటు, గ్రామ, వార్డు కార్యదర్శులకు

సబ్‌ రిజిస్ట్రార్‌ల వద్ద రిజిస్ర్టేషన్లు

గ్రామ,వార్డు సెక్రెటరీలకూ ఆ అధికారం

సర్కారు మెమో.. వ్యాజ్యం పరిష్కారం

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌లతో పాటు, గ్రామ, వార్డు కార్యదర్శులకు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఉన్న అధికారాలు తొలగించలేదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. ఆ వివరాలు నమోదు చేసిన ధర్మాసనం.... ప్రభుత్వం మెమో రూపంలో అందజేసిన వివరాలపై పిటిషనర్‌ సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్ట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. అంతకుముందు.. పిటిష నర్‌ అయిన ఎన్టీఆర్‌ జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామప్రసాద్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

Updated Date - 2022-11-02T06:33:10+05:30 IST
Read more