-
-
Home » Andhra Pradesh » Record as the first person of Indian descent-NGTS-AndhraPradesh
-
రాజాచారి.. గగన విహారి
ABN , First Publish Date - 2022-03-16T08:27:18+05:30 IST
భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి అత్యంత అరుదైన ఘనత సాధించారు. స్పేస్‌వాక్ చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రాజాచారికి తెలంగాణ మూలాలుండటం మరింత విశేషం. అంతరిక్షంలో పరిశోధనల కోసం ఆకాశంలో ఏర్పాటు చేసిన

స్పేస్ వాక్ చేసిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు
న్యూఢిల్లీ, మార్చి 15: భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి అత్యంత అరుదైన ఘనత సాధించారు. స్పేస్‌వాక్ చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రాజాచారికి తెలంగాణ మూలాలుండటం మరింత విశేషం. అంతరిక్షంలో పరిశోధనల కోసం ఆకాశంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకొచ్చిన ఆయన రోదసిలో సంచరించారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫ్లైట్ ఇంజనీర్ కైలా బారన్‌తో కలిసి రాజాచారి స్పేస్‌వాక్ మొదలుపెట్టారు. ఐఎ్‌సఎస్ నుంచి బయటకొచ్చి స్పేస్ స్టేషన్ స్టార్ బోర్డు-4 ట్రస్ వద్దకు చేరుకుని ఇప్పటికే ఉన్న సోలార్ ప్యానళ్ల స్థానంలో కొత్త ప్యానళ్లను అమర్చారు. ఇద్దరూ కలిసి మొత్తం ఆరు ‘ఐఎ్‌సఎస్ రోల్ ఔట్ సోలార్ ఆరే(ఐఆర్‌ఓఎ్‌సఏ)’లను మార్చారు. రాజాచారికి ఇది తొలి స్పేస్ వాక్ కాగా బారన్‌కు రెండోది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రూ-3 మిషన్‌కు 2020లో కమాండర్‌గా ఎంపికైన రాజాచారి గత ఏడాది నవంబర్‌లో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లారు. రాజాచారి తాతముత్తాతలు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు. ఆయన తాతగారి హయాంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది.