Rains: రానున్న 24 గంటలు వర్షసూచన

ABN , First Publish Date - 2022-08-07T00:30:39+05:30 IST

Rains: రానున్న 24 గంటలు వర్షసూచన

Rains: రానున్న 24 గంటలు వర్షసూచన

విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం శనివారం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనున్నది. సోమవారం కల్లా అల్పపీడనం బలపడి పశ్చిమంగా పయనించనున్నది. ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు (Heavy Rains)  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్‌ బలంగా ఉండడంతో ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. శనివారం కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అటు ఇటుగా నమోదయ్యాయి. తిరుపతి (Tirupati)లో 34.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


Read more