సహ కూలీపై అత్యాచారం, హత్య

ABN , First Publish Date - 2022-09-19T09:22:18+05:30 IST

సహ కూలీపై అత్యాచారం, హత్య

సహ కూలీపై అత్యాచారం, హత్య

అచ్యుతాపురం, సెప్టెంబరు 18: అచ్యుతాపురం సెజ్‌లో సహ కూలీపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో కూలీ అత్యాచారం చేసి, ఆపై హత్యచేశాడు. పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ వ్యక్తి, అదే జిల్లాకు చెందిన మరికొంత మంది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఆర్‌సీఎల్‌ కర్మాగారంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరందరికీ బొబ్బిలికి చెందిన వ్యక్తి భార్య (34) రోజూ వంటచేసి పెడుతోంది. పక్కనే మరో షెడ్డులో బెంగాల్‌, ఒడిశాలకు చెందిన 12 మంది కూలీలు ఉంటున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆ మహిళ కనిపించకపోవడంతో ఆమె భర్త అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఆర్‌సీఎల్‌ కర్మాగారం పక్కన ఉన్న తోటలో మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బెంగాల్‌ కూలీల్లో ఒకడైన సుజన సర్దార్‌ (23) శనివారం నుంచి కనిపించడం లేదని నిర్ధారించుకున్నారు. తోటలో మద్యం మత్తులో పడిఉన్న అతడిని స్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. అత్యాచారం విషయం ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో గొంతు నులిపి చంపేసినట్టు అతడు అంగీకరించాడు. 


Read more