విభజన హామీలపై కేంద్రంతో YCP మాట్లాడట్లేదు: Rammohan Naidu

ABN , First Publish Date - 2022-07-15T22:28:10+05:30 IST

విభజన హామీలపై వైసీపీ కేంద్రప్రభుత్వంతో మాట్లాడటం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.

విభజన హామీలపై కేంద్రంతో YCP మాట్లాడట్లేదు: Rammohan Naidu

అమరావతి: విభజన హామీలపై వైసీపీ(YCP) కేంద్ర ప్రభుత్వం(Central Govt)తో మాట్లాడటం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు(Rammohan Naidu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా పేరుతో సీఎం జగన్(CM JAGAN) ఓట్లు దండుకున్నారన్నారు. మాట తప్పం.. మడమ తిప్పమనే జగన్ సిద్ధాంతం ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ (PM MODI) కనిపిస్తే సెల్ఫీలు దిగి సంబరపడే జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదన్నారు. విశాఖ రైల్వే జోన్(Visakha Railway Zone) ప్రకటన వచ్చినా.. నిధులు రూ.కోటి కూడా ఇవ్వడం లేదని రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.

Read more