చంద్రబాబే పాదయాత్ర నిర్మాత

ABN , First Publish Date - 2022-09-19T10:15:48+05:30 IST

రాజధాని రైతుల పాదయాత్రకు మాజీ సీఎం చంద్రబాబు దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా అని మంత్రి విడదల రజని విమర్శించారు. గుంటూరులోని

చంద్రబాబే పాదయాత్ర నిర్మాత

శాంతిభద్రతల సమస్యకు ఆయనదే బాధ్యత: మంత్రి రజని


గుంటూరు, సెప్టెంబరు 18: రాజధాని రైతుల పాదయాత్రకు మాజీ సీఎం చంద్రబాబు దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా అని మంత్రి విడదల రజని విమర్శించారు. గుంటూరులోని కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది. మూడు రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం. న్యాయ వ్యవస్థపై మా నాయకుడు సీఎం జగన్‌కు అపారమైన నమ్మకముంది. రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసమే మా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. పాదయాత్రలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే చంద్రబాబే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వైద్య విభాగాన్ని పటిష్ఠం చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఐదు వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తాం’’ అని రజని అన్నారు. 

Read more