-
-
Home » Andhra Pradesh » Rajahmundry bjp godavari garjana jp nadda vsp-MRGS-AndhraPradesh
-
Apలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: జేపీ నడ్డా
ABN , First Publish Date - 2022-06-08T00:44:54+05:30 IST
రాజమండ్రి (Rajahmundry) సాంస్కృతిక నగరమని... ఈ గడ్డ నుంచే తెలుగు (Telugu) భాష ప్రారంభమైందని ..

తూర్పుగోదావరి: రాజమండ్రి (Rajahmundry) సాంస్కృతిక నగరమని... ఈ గడ్డ నుంచే తెలుగు (Telugu) భాష ప్రారంభమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు (Bjp Nation Chief) జేపీ నడ్డా అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ (Arts College) గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ గోదావరి గర్జన (Godavari Garjana) సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఏపీ (Ap) నుంచి ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపాలని, బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జేపీ నడ్డా (Jp Nadda) తెలిపారు. 2014కు ముందు చాలా ప్రాంతాల్లో కరెంట్, విద్య, వైద్యం ఉండేది కాదని చెప్పారు. అవినీతి అంటే జీవితంలో భాగం కాదని ప్రధాని అన్నారని జేడీ నడ్డా పేర్కొన్నారు. మోదీ (Modi) నాయకత్వంలో అవినీతికి చరమగీతం పాడామని చెప్పారు.