-
-
Home » Andhra Pradesh » Raghuramakrishnamraju comments anr-MRGS-AndhraPradesh
-
MP Raghurama: అమరావతిపై ప్రభుత్వం తీరు కోర్టు తీర్పు ఉల్లంఘన కిందికి వస్తుంది..
ABN , First Publish Date - 2022-09-08T21:34:20+05:30 IST
అమరావతిపై ఏపీ కేబినెట్ దాడి చేస్తోందని, అమరావతిని ఎలా తొక్కేయాలని చూస్తోందని....

ఢిల్లీ (Delhi): అమరావతి (Amaravathi)పై ఏపీ కేబినెట్ (AP Cabinet) దాడి చేస్తోందని, అమరావతిని ఎలా తొక్కేయాలని చూస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై హై కోర్టు (High Court) స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. అమరావతిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కోర్టు తీర్పు ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. కోపంతో అమరావతిని ఏమైనా చేయొచ్చునన్నారు.
ప్రతిపక్షం తనపై, తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోరా అంటూ మంత్రులపై సీఎం జగన్ మండిపడ్డారని రఘురామ అన్నారు. తిట్టే వాళ్ళను కేబినెట్‌లో వేసుకుంటామని అంటున్నారని, బరువు ఒకరికి, బాధ్యత ఇంకొకరి అంటే మంత్రులు మాట్లాడకపోవచ్చునని అన్నారు. టీడీపీ నేతలు సభ్యతతో మాట్లాడారని, అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు ప్రజలు సిగ్గుతో తల దించుకున్నారని అన్నారు. సాయిరెడ్డికి 10 పదవులు, మిథున్ రెడ్డికి నాలుగు పదవులు కేటాయించారని, కాకినాడ పోర్టులో కొంత అరబిందోకు కేటాయించారన్నారు. అరబిందో సాయిరెడ్డికి వియ్యంకుడని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో ప్రముఖ ప్రాధాన్యత వహించిందన్నారు. దీనిపై టీడీపీ నేతలు అనుమానం మాత్రమే వ్యక్తం చేశారన్నారు.
తనపై కస్టొడియల్ టార్చర్‌పై నిన్న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో చేర్చారని రఘురామ తెలిపారు. మెరుగైన జీపీఎస్ ఇస్తామని ఉద్యోగులతో ఆడుకుంటున్నారన్నారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడం లేదని, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడంలేదని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.