మద్యంపై మాట తప్పినందుకు Jagan ఏం చెబుతారు?: Raghurama

ABN , First Publish Date - 2022-06-12T20:17:45+05:30 IST

ఎన్నికల ముందు జగన్ (Jagan) పాదయాత్రలో ఏపీలో మద్యపానం నిషేధిస్తామని చెప్పారని..

మద్యంపై మాట తప్పినందుకు Jagan ఏం చెబుతారు?: Raghurama

Delhi: ఎన్నికల ముందు జగన్ (Jagan) పాదయాత్రలో ఏపీలో మద్యపానం నిషేధిస్తామని చెప్పారని.. ఇప్పుడు మద్యంపై మాట తప్పినందుకు ఏం చెబుతారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్నారు... ఇప్పుడు మద్యం బాండ్లతో సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మద్య నిషేధం హామీని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. మాట నిలబెట్టుకోకుంటే కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆనాడు జగన్ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

Read more