AP News: రుణం మంజూరు చేస్తామంటూ పవన్ ఫొటోతో ప్రచారం

ABN , First Publish Date - 2022-12-06T19:36:26+05:30 IST

Vijayawada: జనసేన (Janasena) పార్టీ పేరుతో వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి..గంటలోపే రుణాలిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై

AP News: రుణం మంజూరు చేస్తామంటూ పవన్ ఫొటోతో ప్రచారం

Vijayawada: జనసేన (Janasena) పార్టీ పేరుతో వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి..గంటలోపే రుణాలిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేంద్ర అనే వ్యక్తి రాఘవేంద్ర ప్రైవేట్ ఫైనాన్స్ పేరిట 6303209022 నంబర్‌తో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని డిస్‌ప్లే ఫొటోగా ఉంచి గంటలోనే రుణాలు మంజూరు చేస్తామని ప్రచారం మొదలుపెట్టాడు. అయితే రుణం కావాల్సిన వారు ముందుగా రూ. 3,800 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెబుతుండడంతో విషయం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సూచన మేరకు పార్టీ లీగల్ సెల్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-12-06T19:36:27+05:30 IST