రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీస్.. పీఆర్సీ సాధన సమితి కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-23T23:19:09+05:30 IST

పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‎కు సమ్మె నోటీస్ ఇవ్వాలని..

రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీస్.. పీఆర్సీ సాధన సమితి కీలక నిర్ణయం

విజయవాడ: పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‎కు సమ్మె నోటీస్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రతి జిల్లాకు ప్రతి జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించింది. ఉద్యమం విజయవంతం చేయడానికి నలుగురు నాయకులను పంపాలని తీర్మానించింది. ప్రతిరోజూ జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై రాష్ట్రస్థాయి నాయకులు నివేదిక ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ‎లను కలుపుకుని ఉద్యమం చేయాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 


అటు రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోలను ఇచ్చి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘ నేతల ఆరోపిస్తున్నారు. చీకటి జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. హెచ్‎ఆర్‏ శాబ్లో పాత పద్ధతిలోనే ఉద్యోగులకు మంజూరు చేయాలని కోరుతున్నారు. పీఆర్సీకి డీఏ‌కి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. జీతం పెరిగిందని రుజువు చేస్తే కార్యాచరణ ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. తమకు పాత పీఆర్సీనే అమలు చేసి డీఏలు చెల్లించాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉద్యోగులు అందరూ కలిసి పాత పద్ధతిలోనే  11వ పీఆర్సీ అమలు కోసం పోరాడాలని నిర్ణయించారు. అన్ని ఉద్యోగ సంఘాల కలిసి చీకటి జీవోలు రద్దు చేసే వరకు పోరాడతామని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. 


Updated Date - 2022-01-23T23:19:09+05:30 IST