సమస్యలు పరిష్కరించిన తర్వాతే గడపగడపకు రావాలి

ABN , First Publish Date - 2022-10-04T05:27:22+05:30 IST

నాగులుప్పలపాడు మండలం కనపర్తిగ్రామంలో సమస్యలు పరిష్కరించిన తరువాతే గడపగడపకు కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్థులు తీర్మానించారు. కనపర్తి గ్రామంలో గ్రామస్థులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఉపాధి హామీ పనులు గ్రామంలో కొందరికి మాత్రమే కల్పించారని,మరికొంతమందికి కల్పించలేదని, రాజకీయాలతో పేదరికాన్ని ముడిపెట్టి పేదలకు ప్రభుత్వం కల్పించే పనులను రాకుండా చేస్తున్నారని వారు వాపోయారు.

సమస్యలు పరిష్కరించిన తర్వాతే గడపగడపకు రావాలి
కనపర్తిలో సమావేశమైన గ్రామస్థులు

కనపర్తి గ్రామస్థుల తీర్మానం

నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌)అక్టోబరు3: నాగులుప్పలపాడు మండలం కనపర్తిగ్రామంలో సమస్యలు పరిష్కరించిన తరువాతే గడపగడపకు కార్యక్రమాలు  చేపట్టాలని గ్రామస్థులు తీర్మానించారు. కనపర్తి గ్రామంలో గ్రామస్థులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఉపాధి హామీ పనులు గ్రామంలో కొందరికి మాత్రమే కల్పించారని,మరికొంతమందికి కల్పించలేదని, రాజకీయాలతో పేదరికాన్ని ముడిపెట్టి పేదలకు ప్రభుత్వం కల్పించే  పనులను రాకుండా చేస్తున్నారని వారు వాపోయారు. ఇలాంటి పరిస్థితులలో గ్రామంలో పేదల సమస్యలు పరిష్కరించిన తరువాతే స్థానిక ఎంఎల్‌ఏ గానీ అధికారులు గానీ గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలని గ్రామస్థులు తీర్మానించారు. ఈ సమావేశంలో కే గోపిరెడ్డి, పీ నాగిరెడ్డి,పి. శ్రీనివాసరెడ్డి, కృష్ణమూర్తి, ముసలయ్య, శివారెడ్డి, ఎం.రామాంజనేయరెడ్డి, కెఎన్‌రెడ్డి, పి. నాగరాజు, సీహెచ్‌ ఆంజనేయులు , పి. ముసలారెడ్డి, కోటిరెడ్డి, పి. శ్రీనివాసులరెడ్డి, చాట్ల కిరణ్‌కుమార్‌, కె . శివప్రసాదు , ఎం. ఏసురత్నం ,పి. ఏడుకొండలు , వి. నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-04T05:27:22+05:30 IST