-
-
Home » Andhra Pradesh » Prakasam » You got the position of in charge by holding Baline legs-NGTS-AndhraPradesh
-
బాలినేని కాళ్లు పట్టుకొని ఇన్చార్జ్ పదవి తెచ్చుకున్నావ్..
ABN , First Publish Date - 2022-09-08T05:56:53+05:30 IST
కుమారుడి పె ళ్లికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ హ్వానించి ఆయన కాళ్లు పట్టుకొని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి తెచ్చుకుంది నువ్వు కా దా, అలాంటిది నువ్వా ఎమ్మెల్యే స్వామిని విమర్శించేదని వైసీపీ ఇన్చార్జ్ వరికూటి అశోక్‌బాబుపై టీడీపీ మండల ఎస్సీ సెల్ నాయకులు ఆ గ్రహం వ్యక్తం చేశారు.

వరికూటిపై టీడీపీ ఎస్సీసెల్ ధ్వజం
టంగుటూరు, సెప్టెంబరు 7 : కుమారుడి పె ళ్లికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ హ్వానించి ఆయన కాళ్లు పట్టుకొని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి తెచ్చుకుంది నువ్వు కా దా, అలాంటిది నువ్వా ఎమ్మెల్యే స్వామిని విమర్శించేదని వైసీపీ ఇన్చార్జ్ వరికూటి అశోక్‌బాబుపై టీడీపీ మండల ఎస్సీ సెల్ నాయకులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై వైసీపీ ఇన్చా ర్జ్ వరికూటి అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలను మండల ఎస్సీ సెల్ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే స్వామి దామచర్ల కుటుంబానికి విఽధేయుడే త ప్ప నువ్వన్నట్లు బానిస కాదన్నారు. స్వామిది నీ లాగ నోరు జారే వ్యక్తిత్వం కాదని, ఆయన్ని వి మర్శించే స్థాయి మీకు లేదన్నారు. నియోజకవర్గ ప్రజల మన్ననలతో రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన స్వామి ఈసారీ గెలవడం ఖాయమని, ఆయన విజయానికి తిరుగులేదని వారు పేర్కొన్నారు. కాకుటూరివారిపాలెంలో పోలీసులను అడ్డుపెట్టుకొని దాతలు నిర్మించిన మరుగుదొడ్ల భవనంపై ట్యాంకుకున్న పసుపు రంగు మార్చి ఏదో సాధించిన్నట్లు సంబరపడవద్దని, పసుపురంగంటే ఎందుకంత కలవరం అని ప్ర శ్నించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, మాటలు పద్ధతిగా మాట్లాడితే మంచిదని వారు హెచ్చరించారు. ప్రకటన విడుదల చేసిన వా రిలో టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కసుకుర్తి భాస్కర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షు డు కొమ్ము భానుచందర్, ప్రధాన కార్యదర్శి పిడుగురాళ్ల సురేష్, పార్టీ మండల ప్రధాన కా ర్యదర్శి మేడికొండ రవీంద్ర, మండల పార్టీ అధికార ప్రతినిధి జక్కుల శ్రీను, కార్యనిర్వాహక స భ్యులు ఎం.శ్రీనివాసులు, లింగాల బాలకోట య్య, పెరికల దయానందం ఉన్నారు.