ప్రమాదాలకు నిలయంగా వైజంక్షన్‌

ABN , First Publish Date - 2022-09-11T05:07:49+05:30 IST

పర్చూరు వైజంక్షన్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. పలు పట్టణా లకు వెళ్ళేందుకు ప్రధాన కూడలి కావటంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగు తుంటాయి.

ప్రమాదాలకు నిలయంగా వైజంక్షన్‌
ప్రమాదకరంగా పర్చూరు వైజంక్షన్‌

కనిపించని సూచిక బోర్డులు

గమ్యస్థానం తెలియక కొంతదూరం వెళ్లి వెనుతిరుగుతున్న వాహనదారులు

పట్టించుకోని అధికారులు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పర్చూరు, సెప్టెంబరు 10: పర్చూరు వైజంక్షన్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. పలు పట్టణా లకు వెళ్ళేందుకు ప్రధాన కూడలి కావటంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగు తుంటాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగు తుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నా రు. గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, చీరాల తదితర పట్టణాలకు ఈ కూడలి నుంచే వాహనదా రులు రాకపోకులు సాగిస్తుంటారు. దీనికితోడు అమ రావతికి పర్చూరు నుంచి ప్రయాణం సులభతరం కావటంతో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిం ది. వాహనాలు వైజంక్షన్‌ దాటగానే ఊపిరి పీల్చు కోవాల్సిన వస్తుందంటే పరిస్థితి ఎంత ప్రమాదక రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి సమయాల్లో పరిస్థితి మరింత దయ నీయంగా మారింది. 


నిత్యం ప్రమాదాలే...

పర్చూరు వైజంక్షన్‌లో నిత్యం ప్రమాదా లే అన్న చందాన పరిస్థితి ఉంది. ఇటీవల బోడవాడ నుంచి పర్చూరు వైపు వస్తున్న ద్విచక్రవాహన దారుడు,  చిలకలూరిపేట నుంచి పర్చూరు వస్తున్న ఆర్‌టీసీ బస్సు ఢీ కొనటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే,  ఆటో బైక్‌ను ఢీకొనటంతో ఇరువురికి తీవ్ర గాయాలై గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అన్నంబొట్లవారిపాలెం నుంచి బోడవాడ గ్రామానికి చెందిన కూలీలు ట్రా క్టర్‌లో కూలీ పనులు ముగించుకొని తిరిగి వస్తుండ గా ప్రమాదానికి గురయ్యారు. ఇలాంటి సంఘనలు అనేకం ఉన్నాయి.


సూచిక బోర్డులు ఎక్కడ..

వివిధ ప్రాంతాల నుంచి వైజంక్షన్‌ కూడలికి చేరుకున్న వాహనదారులకు తమ గమ్యస్థానాలకు ఎటువైపు వెళ్ళాలో అర్థంకాక తలలు పట్టుకుం టున్నారు. కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవ టంతో కిలోమీటర్లు ప్రయాణం చేసి తాము వెళుతు న్న మార్గం సరికాదని గ్రహించి వెనుతిరిగి రావాల్సి న దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత ఆర్‌ అండ్‌బీ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్ధలు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి వైజంక్షన్‌ కూ డలిలో సూచిక బోర్డులతోపాటు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలు వురు కోరుతున్నారు. 

Read more