ఆర్వోప్లాంట్‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2022-04-11T04:43:04+05:30 IST

మండలంలోని ఆశంవారిపల్లి గ్రామంలోని ఆర్వోప్లాంట్‌ను కొంతమంది వైసీపీ నాయకులు ఆదివారం ధ్వంసం చే శారు.

ఆర్వోప్లాంట్‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు
ధ్వంసమైన ఆర్వో ప్లాంట్‌

సీఎ్‌సపురం, ఏప్రిల్‌ 10 : మండలంలోని ఆశంవారిపల్లి గ్రామంలోని ఆర్వోప్లాంట్‌ను కొంతమంది వైసీపీ నాయకులు ఆదివారం ధ్వంసం చే శారు. టీడీపీ హయాంలో ప్రజలకు శుద్ధి జలాన్ని అందించాలనే ఉద్దేశం తో  ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకంలో ఆర్వో ప్లాంట్‌ను నిర్మించారు. ప్లాంట్‌కు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుని స్థలంలో నిర్మించి ప్రజలకు రూ.5లకు తాగునీటిని అందిస్తున్నారు. ఆ ప్లాంట్‌ను స్థలానికి చెం దిన వ్యక్తి నిర్వహిసున్నాడు. ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోనికి రావడంతో ప్లాంట్‌ను తమకు అప్పగించాలని కొందరు ఒత్తిడి తెచ్చారు.  తన స్థలంలో నిర్మించిన ప్లాంట్‌ను మీకు అప్పగించనని చెప్పడంతో పంచాయితీ కార్యదర్శిపై వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి కొంతకాలం క్రితం ఆర్వో ప్లాంట్‌కు తాళం వేయించారు. ఈ క్రమంలోనే ఆదివారం  కొంతమంది వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ప్లాంట్‌ను ధ్వంసం చేసి సామగ్రిని తీసుకెళ్లారు. ఈ విషయంపై పంచాయితీ కార్యదర్శి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌కు అందుబాటులోనికి రాలేదు.


Read more