రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2022-09-24T06:28:50+05:30 IST

మూడేళ్లగా రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు దోచుకుతింటుంన్నారని మార్కా పురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ నాయకులు
మాట్లాడుతున్న కందుల నారాయణరెడ్డి

కొనకనమిట్ల, సెప్టెంబరు 23 : మూడేళ్లగా  రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు దోచుకుతింటుంన్నారని మార్కా పురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఇరసలగుండం గ్రామంలో శుక్ర వారం టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబూరావు అధ్యక్షతన కందుల నారాయణరెడ్డి  ఆధ్వర్యంలో బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను గ్రామాలలో ప్రజలు నమ్మ వద్దన్నారు. ఇసుక, మద్యం, నిత్యవసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంట్‌, బస్‌ చార్జీలు తదితర వాటిపై అధిక పన్నులు వేసి పేద మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. అన్నిరకాల పన్నుల వేసి ప్రతి కుటుంబం నుంచి సంవత్సరానికి రూ.1.08 లక్షలు చొప్పున దోచుకుంటున్నాడని విమర్శిం చారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ఆమడదూరంలో పెట్టి నవరత్నాల పేరుతో వైసీపీ నాయకుల జేబులు నింపేందుకు కొత్తకొత్త పథకాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జగన్‌రెడ్డి చేస్తున్న పాలనను ఒక్కసారి గమనించాలని ప్రజలను కోరారు. తెలుగురాష్ట్ర ప్రజల ఆరాద్య దైవం దివంగత మహానేత ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యునివర్సిటీ పేరుమార్చి వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీగా నామకరణం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తెలుగువారి ఆత్మ గౌర వాన్ని కించపరచడమే అవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా యూనివర్సిటి పేరు మార్పుపై పునరా లోచించాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలన్నారు. రాష్ట్రం సమగ్రాభివృద్ది చెందాలంటే తిరిగి చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  రాష్ట్రంలో అసమర్దపాలనను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సాగిస్తున్నారని విమర్శించారు.  తొలుత ఇరసలగుండం గ్రామంలో నారాయణరెడ్డికి టీడీపీ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబురావు, పొదిలి మార్కెట్‌ యార్డు మాజీ అధ్యక్షులు చప్పిడి రామలింగయ్య, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము రామిరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వరికూటి వెంకటరామిరెడ్డి, కనకం నరసింహారావు, ఏదుబాటి వెంకటనారాయణచౌదరి, మువ్వా కాటంరాజు, శ్రీకాంత్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌,  జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరెడి, జిల్లా మైనారిటి సెల్‌ అధ్యక్షుడు రసూల్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్‌, పొదిలి మాజీ సర్పంచ్‌ కాటూరి పెదబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీను,  గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-24T06:28:50+05:30 IST