వెలిగొండ ప్రాజెక్ట్‌ను విస్మరించిన వైసీపీ

ABN , First Publish Date - 2022-03-17T05:09:19+05:30 IST

వైసీపీ పాలకులు వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిగా విస్మరించారని టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు విమర్శించారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌ను విస్మరించిన వైసీపీ
మాట్లాడుతున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు(మార్కాపురం), మార్చి 16 : వైసీపీ పాలకులు వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిగా విస్మరించారని టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు విమర్శించారు. టీడీపీ మండల కన్వీనర్‌ మెట్టు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని ప్రగళ్లపాడులో టీడీపీ గౌరవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వైసీపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీపై మంజూరు చేసే వ్యవసాయ పరికరాలను అందించడం లేదన్నారు.  వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ విఫలమయ్యారని విమర్శిం చారు. ఇకనుంచి గ్రామాలలో ఇంటింటికీ తిరగాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, ఇప్పటి వరకు ప్రజల బాగో గులు పట్టించుకోలేదా అని నిలదీశారు. వాళ్లు గ్రామాలలోకి వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యవర్గ సభ్యుడు గుమ్మా గంగరాజు, టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, దొడ్డా భాస్కరరెడ్డి,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, ఎస్సీ సెల్‌ నాయకులు లింగాల అబ్రహం పాల్గొన్నారు. 

Read more