నిరంకుశ విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-03-04T05:30:00+05:30 IST

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఈపీ ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని అవలంబిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని 17వ వార్డు నల్లబండ బజారులో శుక్రవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన గౌరవ సభలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలోని 1,404 మంది నిరుపేద కుటుంబాలకు టీడీపీ హయాంలో గృహాలను మంజూరు చేయగా నిర్మాణ పనులు 90శాతం పూర్తికాగా వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తిచేయకుండా ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

నిరంకుశ విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం
సభలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు, మార్చి 4 : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఈపీ ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని అవలంబిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ  నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని 17వ వార్డు నల్లబండ బజారులో శుక్రవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన గౌరవ సభలో  అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలోని 1,404 మంది నిరుపేద కుటుంబాలకు టీడీపీ హయాంలో గృహాలను మంజూరు చేయగా నిర్మాణ పనులు 90శాతం పూర్తికాగా వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తిచేయకుండా ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.  తాగునీటి సమస్య పరిష్కారం కోసం గుండ్లమోటు నుంచి పైపులైన్‌ ద్వారా పట్టణ ప్రజలకు నీరు ఇవ్వగా చాలావరకు నీటిసమస్య పరిష్కారం అయిందని పేర్కొన్నారు. రకరకాల కారణాలతో  పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగించడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుతోనే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ పట్టణ  అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, మాజీ అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి షేక్‌ పెద్దబాషా, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బోయిళ్ళపల్లి కిశోర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బి.చంద్రశేఖర్‌యాదవ్‌, మాజీ కౌన్సిలర్లు రామలక్ష్మి, మండ్ల శ్రీనివాసులు, వెంకటస్వామి,  టీడీపీ నాయకులు చింతలపూరి బాలరాజు, బిల్లా రమేష్‌, పాలుగుళ్ళ చిన్నశ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

Read more