మహిళా సాధికారతకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-09-30T05:17:32+05:30 IST

ఎమ్మెల్యే కరణం బలరాం వేటపాలెం(చీరాల), సెప్టెంబరు 29: ప్రభుత్వం మహిళా సాధికారికతకు పె ద్దపీట వేస్తుందని, అందుకు సీఎం జగ న్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంక టేష్‌ పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కరణం బలరాం, వెంకటేష్‌

ఎమ్మెల్యే కరణం బలరాం

వేటపాలెం(చీరాల), సెప్టెంబరు 29: ప్రభుత్వం మహిళా సాధికారికతకు పె ద్దపీట వేస్తుందని, అందుకు సీఎం జగ న్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంక టేష్‌ పేర్కొన్నారు. స్థానిక బండ్ల బాపయ్య హిం దూ జూనియర్‌ కళాశాలలో గురువారం వైఎస్సార్‌ చేయూత మూడో విడత లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతి థులుగా హాజరైన ఎమ్మెల్యే కరణం బలరాం, వెంకటేష్‌ మాట్లాడుతూ  సంక్షేమం, అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధిచేకూరుతుందన్నారు. ఇది పారదర్శకమైన పాలనకు నిద ర్శనమని చెప్పారు. అనంతరం రూ.8.72 కోట్ల చెక్కుల ను లబ్ధిదారు లకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శర్మ వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, పలువురు అఽధికారులు, సిబ్బంది, డ్వాక్రా గ్రూపుల మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


‘సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం’

చీరాల, సెప్టెంబరు 29: సమస్యల పరిష్కారా నికి గడప, గడపకు మన ప్రభుత్వం మంచి వేది కని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంక టేష్‌ చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా  గురువారం రాత్రి డాక్టర్‌ హైమా సుబ్బారావు, వన్‌టౌన్‌ సీఐ మల్లికార్జున రావు, వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, నా యకులు, కార్యకర్తలతో కలసి స్దానిక 21వ వార్డు లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వపనితీరు తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు.  ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులకు అందుకు సం బంధించి పలుసూచనలు చేశారు. కార్య క్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మహిళలకు ఆర్థిక చేయూత

పర్చూరు, సెప్టెంబరు 29: మహిళ లకు ఆర్థిక చేయూతను అందించి స్వయం కృషితో అభివృద్ధిని సాధిం చే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని వైసీపీ పర్చూరు నియోజకవర్గ  ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు. గురువారం పర్చూరులోని కొల్లావారి కల్యాణ మండపంలో జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీడీవో లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. రామ నాథంబాబు మాట్లా డుతూ అభివృద్ధి, సం క్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబా నికి లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమం త్రి జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం మండలంలో 3,011 మంది లబ్ధిదారులకు చేయూత చెక్కును అందజేశారు. 

కార్యక్రమంలో జడ్పీటీసీ కొల్లా గంగాభవానీ, ఎంపీపీ మేకతోటి ఆ నందకుమారి, వైస్‌ ఎంపీపీ కోటా ప్రసన్న, కొల్లా సుభాష్‌బాబు, కోటా హరిప్రసాద్‌, వైసీపీ మండల కన్వీనర్‌ కఠారి అప్పారావు, యద్దనపూడి హరిప్రసాద్‌, ఒగ్గిశెట్టి శివనాగప్రసాద్‌, కోటా శ్రీనివాసరావు తదిత రులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T05:17:32+05:30 IST