క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

ABN , First Publish Date - 2022-11-16T00:11:35+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు క్రీడాపోటీలు దోహదపడతాయని వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు.

క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

చినగంజాం, నవంబరు 15: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు క్రీడాపోటీలు దోహదపడతాయని వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు. కడవకుదురు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో పర్చూరు నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను నిర్వహించి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. క్రీడల్లో గెలుపు, ఓట మిలను సమానంగా స్వీకరించాలని రామనాథంబాబు అన్నారు.

పర్చూరు నియోజకవర్గ పరిధిలోని పూసపాడు, పూనూరు, చినగం జాం, కడవకుదురు తదితర ప్రాంతాల నుంచి అండర్‌-18కు పురుషు లు, స్త్రీల వాలీబాల్‌ పోటీలకు 30 మంది, ఇంకొల్లు, కడవకుదురు, చినగంజాం, సోపిరాల, రాజుబంగారుపాలెం, కొత్తపాలెం తదితర గ్రామాల నుంచి అండర్‌-18కు పురుషులు, స్త్రీల కబడ్డీ పోటీలకు 30 మంది వచ్చినట్లు జిల్లా స్పోర్ట్స్‌ ఆథారిటీ అధికారి పాల్‌ తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారిని వాలీబాల్‌కు 18 మంది, కబడ్డీ పురుషుల జట్టుకు 15 మందిని, స్త్రీల కబడ్డీ జట్టుకు 15 మందిని ఎం పిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీ లలో పాల్గొంటారని తెలిపారు.

కార్యక్రమంలో కడవకుదురు సర్పంచ్‌ గొల్లమూరి శివకుమారి, పాఠ శాల హెచ్‌ఎం బి.ప్రసన్న, ఎంపీటీసీ ఆమంచి వెంకటసుబ్బారావు, ఎస్‌ ఐ కె.అనూక్‌, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ జీవీ రామకృష్ణారెడ్డి, వాలీ బాల్‌, కబడ్డీ కోచ్‌లు రాధాకృష్ణ, శైలజ, పాఠశాల పీడీ జె.దేవబిక్షం, వైసీపీ నాయకులు పి.లక్ష్మీనారాయణ, పి.ప్రకాష్‌, పి.వెంకటరామయ్య, సీహెచ్‌ పుల్లయ్య, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:11:35+05:30 IST

Read more