స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు మోక్షమెప్పుడు..?

ABN , First Publish Date - 2022-04-06T05:04:43+05:30 IST

ఒంగోలులోని పీవీ ఆర్‌ క్రీడా మైదానానికి మహర్ధశ పడుతుందని పాలకులు ఇచ్చిన హామీలు గాలికి ఎగిరిపోయాయి. ఆధునిక విధా నంలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చేపట్టిన ప్రతిపాదనలు హామీలకే పరిమితం అయ్యాయి. రెండేళ్లు పూర్తయినాఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రభుత్వ ప్రకటనలు ప్రచార ఆర్భాటమే అని స్పష్టమవుతోంది.

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు మోక్షమెప్పుడు..?
పీవీఆర్‌ స్కూలు వద్ద ఆవిష్కరించిన పైలాన్‌

పీవీఆర్‌లో క్రీడల అభివృద్ధికి రూ.59 లక్షలు కేటాయింపు

రెండేళ్లుగా పురోగతి లేని స్టేడియం పనులు

హామీలకే పరిమితమైన పాలకులు 


ఒంగోలు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 5 : ఒంగోలులోని పీవీ ఆర్‌ క్రీడా మైదానానికి మహర్ధశ పడుతుందని పాలకులు ఇచ్చిన హామీలు గాలికి ఎగిరిపోయాయి. ఆధునిక విధా నంలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చేపట్టిన ప్రతిపాదనలు హామీలకే పరిమితం అయ్యాయి. రెండేళ్లు పూర్తయినాఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రభుత్వ ప్రకటనలు ప్రచార ఆర్భాటమే అని స్పష్టమవుతోంది. 

ఒంగోలు కార్పొరేషన్‌కు చెందిన పీవీఆర్‌ బాలుర పాఠ శాల క్రీడామైదానానికి మహర్ధశ లభించనుందని, పాఠశా ల అభివృద్ధి, 6 ఎకరాల మైదానంలో స్టేడియం వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని ఆనాడు కా ర్పొరేషన్‌ యంత్రాంగం చెప్పుకొచ్చింది. ఇదంతా రెండేళ్ళ క్రి తం మాట. అయితే ఇపుడు అలాంటిదేమీ ఇక్కడ లే కపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి కార్యక్రమాన్ని ఒంగోలులో 2019 నవం బరు 13న లాంఛనంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. క్రీ డల అభివృద్ధికి, పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు పో యారు. పథకంలో భాగంగా తొలుత పీవీఆర్‌ బాలుర పా ఠశాల అభివృద్ధికి కార్పొరేషన్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.59లక్షల మంజూరుకు అనుమతులు లభించాయి. క్రీడామైదానం అభివృద్ధికి రూ.25లక్షలు, 200 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌కు రూ.15లక్షలు, హ్యాండ్‌బాల్‌ కోర్టు ఏర్పాటుకు రూ.3లక్షలు, కబడ్డీ కోర్టుకు రూ.లక్ష, ఫుట్‌బాల్‌ కోర్టుకు రూ.12లక్షలు, ఖోఖో కోర్టుకు రూ.2లక్షలు, టెన్నికా యిట్‌ కోర్టుకు రూ.లక్ష నిధులు వెచ్చించాల్సి ఉంది. అవుట్‌ డోర్‌ క్రీడామైదానం కోసం కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.25లక్షలు కేటాయించనుండగా, జిల్లా పరిషత్‌ నిఽధుల నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేసేలా ప్రతిపాదన లు సిద్ధం అయ్యాయి. కాగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి మరో రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిఉంది. ఇదిలా ఉండగా స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణానికి, క్రీడాకారులకు డా ర్మెటరీ, విద్యార్థులకు మూడు అంతస్తుల హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అప్పటి క లెక్టర్‌, కార్పొరేషన్‌ స్పెషలాఫీసర్‌గా ఉన్న పోలా భాస్కర్‌ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ కు చెందిన భార్గవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఓ శిలాఫలకం వేసి, శంకుస్థాపనలతో ప్రచార ఆర్భాటాలు చేసిన యంత్రాంగం ఆ తర్వాత దాని ఊసే మరిచారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మా ణానికి నిధులు లేవని తెలుస్తుండగా, ఇప్పట్లో నిర్మాణాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 


ప్రతిపాదించిన పనులు


యోగ అండ్‌ మెడిటేషన్‌, 50మందికి సరిపోయే జిమ్‌, ఇండోర్‌ గేమ్స్‌ రూం, 100మంది క్రీడాకారుల క్యాంపస్‌మీ ట్‌, మరుగుదొడ్లు, 250కి సరిపోయే డార్మిటరీ, వార్డెన్‌/ క్రి యేటర్‌ రూంు, గ్రౌండ్‌ అభివృద్ధి, వాలీబాల్‌ కోర్టు, 200 మీ. రన్నింగ్‌ ట్రాక్‌, హ్యాండ్‌బాల్‌ కోర్టు, కబడ్డీ కోర్టు, బా స్కెట్‌బాల్‌ కోర్టు, యాంపీ థియేటర్‌, స్విమ్మింగ్‌ పూల్‌


ఇండోర్‌ కాంప్లెక్స్‌లో..


గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు నిర్మాణంలో సెక్యూరిటీ, విశ్రాంతి గదులు, అడ్మినిస్ట్రేషన్‌ చాంబర్‌, డిపార్ట్‌మెంట్‌ రూమ్‌, యోగా, ఎరోబిక్స్‌, కోచ్‌ రూం, టేబుల్‌ టెన్నిస్‌ కోర్టు, బిలియర్డ్స్‌, ఫిజియోథెరపీ రూమ్‌, చేంజింగ్‌ రూమ్స్‌ విత్‌ లాకర్స్‌, రెండవ అంతస్తులో డార్మిటరీ నిర్మాణాలను ప్రతి పాదించారు. 

దీంతో క్రీడాకారులు ఎదురుచూస్తున్న స్కూలు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రభుత్వ హామీలలో ఒకటిగా మిగిలిపోవడం వా రిలో నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా సంబం ధిత కార్పొరేషన్‌, జడ్పీ, క్రీడాప్రాధికార సంస్థ చొరవ చూపి క్రీడా కాంప్లెక్స్‌ నిర్మాణానికి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


Read more