-
-
Home » Andhra Pradesh » Prakasam » Whammo crocodiles-MRGS-AndhraPradesh
-
వామ్మో మొసళ్లు
ABN , First Publish Date - 2022-09-09T05:04:45+05:30 IST
సాగర్ కాలువలో మొసళ్ల కలకలం రేగింది. మండలంలోని ఎండూరివారిపాలెం వద్ద గురువారం సాయంత్రం పొలానికి వెళ్లిన రైతుకు సాగర్ కుడి కాలువలో మూడు మొసళ్లు కన్పించాయి. ఆందోళనకు గురైన ఆయన దూరంగా వెళ్లి వాటిని తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశాడు. మొసళ్లు దిగువ ప్రాంతం వైపు వస్తున్నాయని గణపవరం, త్రిపురాంతకం, రాజుపాలెం గ్రామల ప్రజలతోపాటు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

సాగర్ కాలువలో సంచారం
సెల్‌ఫోన్‌లో ఫొటో తీసిన రైతు
త్రిపురాంతకం, సెప్టెంబరు 8 : సాగర్ కాలువలో మొసళ్ల కలకలం రేగింది. మండలంలోని ఎండూరివారిపాలెం వద్ద గురువారం సాయంత్రం పొలానికి వెళ్లిన రైతుకు సాగర్ కుడి కాలువలో మూడు మొసళ్లు కన్పించాయి. ఆందోళనకు గురైన ఆయన దూరంగా వెళ్లి వాటిని తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశాడు. మొసళ్లు దిగువ ప్రాంతం వైపు వస్తున్నాయని గణపవరం, త్రిపురాంతకం, రాజుపాలెం గ్రామల ప్రజలతోపాటు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. దీంతో సాగర్ కాలువ వైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మొసళ్లను గుర్తించి, రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.