టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమం

ABN , First Publish Date - 2022-11-08T00:41:26+05:30 IST

టీడీపీ హాయాం లోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందా యని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమం

కొమరోలు, నవంబరు 7 : టీడీపీ హాయాం లోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందా యని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని అయ్యవారి పల్లి గ్రామంలో సోమవారం బాదుడే- బాదుడు కార్యాక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి కర పత్రాలను పంపిణీచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షే మం జరిగిందన్నారు. నాడు ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లను కోట్లు రూపాయలు ఖర్చు చేయగా ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడా సిమెంట్‌ రోడ్డు వేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. టీడీపీ హయాంలో పంచాయతీలకు పుష్కలంగా నిధులు ఇచ్చి తాగునీటి అవసరాల కు, పారిశుధ్య పనులను ప్రజాప్రతినిధులు చేపట్టారన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ లకు నిధులు లేక సర్పంచులు అప్పులుచేసి బోర్లు రిపేరు, పారిశుధ్య పనులను చేపట్టినా వారికి నిధులు రాకపోవడంతో సర్పంచ్‌లు రోడ్లు ఎక్కి దర్నాలు, రాజీనా మాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. రైతులకు విద్యుత్‌ మీటర్లు పెట్టి వారి నడ్డి విరుస్తున్నార ని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోం దన్నారు. రాష్ట్ర అభివృద్ధి కి వ్యక్తిగత రుణాలు, రాయితీ రుణాలు, రైతు లకు పావలా వడ్డి వంటి సంక్షేమాలను ఈ ప్రభుత్వం మరచిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం పెంచిన నిత్యవసర వస్తువులు, విద్యుత్‌ చార్జీలు, ఇసుక, సిమెంటు ఇంటిపన్నుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా ప్రజలపై భారాన్ని వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు కార్యదర్శి వీవీ రాఘవరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యాదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి, బీసీ రాష్ట్రసమితి నాయ కులు అనపా వీరశేఖర్‌, మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవరెడ్డి, గోడి ఓబుల్‌రెడ్డి, నాయ కులు బిజ్జం వెంకట్రామిరెడ్డి, మేడం జ్యోతిరెడ్డి, బోడ్డు రంగయ్య, కందుల శింగర్‌రెడ్డి, పుల్లయ్య, నరసింహులు, అబ్బూరి వెంకటేశ్వర్లు, కమతం నరసింహులు, పల కొలను నారాయణరెడ్డి, గోపాలకృష్ణ, కృష్ణ మోహన్‌రెడ్డి, శ్రీనివాసచౌదరి, కృష్ణబాబు కేశవగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T00:41:26+05:30 IST

Read more