ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2022-10-11T05:54:49+05:30 IST

గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగపడకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం 12వ డివిజన్‌లోని రంగుతోటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం
రంగుతోటలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని

ఎమ్మెల్యే బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 10 : గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగపడకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం 12వ డివిజన్‌లోని రంగుతోటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతుంటే ఏన్ని పథకాలు అందుతున్నాయని తెలుసుకున్నారు. కాగా మహిళలు ఈ సందర్భంగా పలు సమస్యలను బాలినేని దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, పారిశ్రామికవేత్త కంది రవిశంకర్‌, డివిజన్‌ అధ్యక్షుడు కటారి లక్ష్మణ్‌, నజీర్‌, కమిషనర్‌ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు అయినాబత్తిన ఘనశ్యాం, చుండూరి రవిబాబు, షౌకత్‌, మురళీ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు ఉన్నారు. 

Read more