నిమ్జ్‌తో జీవనోపాధి కోల్పోతాం

ABN , First Publish Date - 2022-11-25T00:10:43+05:30 IST

నిమ్జ్‌ వల్ల జీవనోపాధిని కోల్పోయి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుందని నిమ్జ్‌ ఏర్పాటు ప్రాంత ప్రజలు జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పామూరు, పీసీపల్లి మండలాల్లో దా దాపూ 5,818 హెక్టార్లలో రూ.4,381 కోట్ల పెట్టుబడితో తలపెట్టదలచిన నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి వుంది.

నిమ్జ్‌తో జీవనోపాధి కోల్పోతాం

కనిగిరి, నవంబరు 24 : నిమ్జ్‌ వల్ల జీవనోపాధిని కోల్పోయి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుందని నిమ్జ్‌ ఏర్పాటు ప్రాంత ప్రజలు జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పామూరు, పీసీపల్లి మండలాల్లో దా దాపూ 5,818 హెక్టార్లలో రూ.4,381 కోట్ల పెట్టుబడితో తలపెట్టదలచిన నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి వుంది. ఈ మేరకు కనిగిరి నియోజకవర్గంలోని నిమ్జ్‌ ఏర్పాటు మండలాలైన పీసీపల్లి, పామూరు మండలాలకు చెందిన గ్రామాల ప్రజలతో గురువారం మార్కొండాపురం ఎంఎ్‌సఎంఈ పార్క్‌ వద్ద కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. నిమ్జ్‌ ఏర్పాటుతో ప్రభావిత గ్రామాలైన బోడవాడ, మాలకొండాపురం, అయ్యన్నకోట, సిద్దవరం, రేణిమడుగు, పెద్దఇర్లపాడు గ్రామాలకు చెందిన ప్రజలు హాజరై తమ సమస్యలను, అభిప్రాయాలను జేసీకి విన్నవించారు. నిమ్జ్‌ ఏర్పాటుతో భూమిని కోల్పోయిన దానికి ఎలా పరిహారం ఇస్తారని, ఉపాధి ఏవిధంగా చూపుతారని ప్రశ్నించారు. అలాగే రోడ్లు, ఇతర వసతులనుజేసీ దృష్టకి తీసుకెళ్లారు. ప్రజలు లేవనెత్తిన ప్రతి సందేహాన్ని ప్రాజెక్టు కన్సల్టెంట్‌ నివృత్తి చేశారు. జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ తయారీరంగ విధానం అమలులో భాగంగా జిల్లాలో నిమ్జ్‌ ప్రతిపాదన జరిగినట్లు ప్రజలకు వివరించారు. ఈ అభిప్రాయ సేకరణలో ప్రజలు వెలిబుచ్చిన అభ్యర్ధనలు, అంశాలను ప్రభుత్వం దృష్టికి నివేదిక రూపంలో అందజేస్తామని జేసీ ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కే సందీ్‌పకుమార్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఏపీఐఐసీ ప్రతినిధులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:10:43+05:30 IST

Read more