నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-11-23T00:09:39+05:30 IST

నాయీబ్రాహ్మణులకు అన్నివిధాల అండగా ఉంటామని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ చెప్పారు.

నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటాం

వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌

చీరాల, నవంబరు 22: నాయీబ్రాహ్మణులకు అన్నివిధాల అండగా ఉంటామని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ చెప్పారు. స్థానిక పాపరాజుతోటలోని బాపనమ్మ కల్యాణమండపంలో మంగళ వారం నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనభో జనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వెంకటేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ధరణికోట చిన్న ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తమను నేరుగా కలవవచ్చునన్నారు. డాక్టరు హైమా సుబ్బారావు, శ్రీకామాక్షికేర్‌ హాస్ప టల్‌ ఎండీ తాడివలస దేవరాజ్‌ తదితరులు మాట్లాడుతూ ఐకమ త్యంగా ఉండి ముందుకుసాగుదామన్నారు. కార్యక్రమం్లలో తాడివ లస కుమార్‌, సురుష్‌, కలవకూరి మురళీమోహన్‌, మార్కాపురం వెంకటరామారావు, బోసుబాబు, వెంకటస్వామి, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు, సత్యన్నారాయణ, చీరాల, పేరాల పట్టణ నాయిబ్రా హ్మణసంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

వేటపాలెం(చీరాల), నవంబరు 22: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. స్థానిక సచివాలయం-2 రెండు పరిధిలో మంగళ వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరిగారు. ఏ సమస్య ఉన్నా నిర్మొహమాటంగా చెప్పి వాటిని పరిష్కరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో శర్మ, ఏపీఎం శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:11:18+05:30 IST