కట్టుకున్న వాడే కడతేర్చాడు!

ABN , First Publish Date - 2022-02-23T06:05:06+05:30 IST

సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో ఈనెల 14వతేదీ రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి పంపకం వి షయంలో చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. అతడిని అ రెస్టు చేశారు.

కట్టుకున్న వాడే కడతేర్చాడు!

గురిజేపల్లిలో వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు 

 ఆస్తి పంపకంలో గొడవలే కారణం 

 నిందితుడి అరెస్టు 

 వివరాలను వెల్లడించిన డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి 


అద్దంకి, ఫిబ్రవరి 22 : సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో ఈనెల 14వతేదీ రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి పంపకం వి షయంలో చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. అతడిని అ రెస్టు చేశారు. వివరాలను దర్శి డీఎస్పీ నారాయణస్వా మిరెడ్డి మంగళవారం అద్దంకిలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. సంతమాగులూరు మండలం గురిజే పల్లికి చెందిన పాలెపు సుబ్బాయమ్మ అలియాస్‌ సుబ్బ మ్మ(65), హరిరావు(హరిబాబు) భార్యాభర్తలు. వారికి కుమార్తెలు రమాదేవి, సుజాత ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సుమారు 45 సంవత్సరాల క్రితం హరి బాబు గురిజేపల్లి నుంచి వెళ్లిపోయాడు. ద్రోణాదులలో ఉన్న తన సోదరి కుమార్తెను రెండో వివాహం చేసుకొని ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో ఉంటున్నారు. ఇ ద్దరు కుమార్తెలను సుబ్బమ్మ పెంచి పెళ్లిళ్లు చేసింది. ఒం టరిగానే గురిజేపల్లిలో ఉంటోంది. ఆమె ఇద్దరు కుమార్తె లు చిలకలూరిపేటలో ఉంటున్నారు. సుబ్బాయమ్మకు 2.15 ఎకరాల పొలం ఉండగా వివాహాల సమయంలో కుమార్తెలకు చెరి సగం ఇస్తానని చెప్పింది. హరిబాబు అప్పుడప్పుడూ గురిజేపల్లిలోని సుబ్బమ్మ వద్దకు వచ్చి వెళ్తుంటాడు. సుబ్బమ్మ పెద్ద కుమార్తెతో, హరిబాబు చిన్న కుమార్తెతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ క్రమం లో గతేడాది పెద్ద కుమార్తె రమాదేవి కుమారుడు విదే శాలకు వెళ్తుండగా తన పేరుతో ఉన్న 2.15 ఎకరాల భూ మిని సుబ్బమ్మ గిఫ్ట్‌ డీడ్‌ కింద రాసి ఇచ్చింది. అదేస మయంలో మనుమడి విదేశీ ఖర్చుల కోసం  సుబ్బమ్మ తన భర్త రెండో భార్య కుమార్తె వద్ద కొంత నగదును తీ సుకుంది. పొలం పెద్ద కుమార్తె కొడుకు పేరుతో రాసిన విషయం తెలుసుకొని భర్త హరిబాబు, చిన్నకుమార్తె సు జాత, చిన్న అల్లుడు బ్రహ్మయ్య గత ఏడాది సుబ్బమ్మతో  గొడవ పెట్టుకున్నారు. ఆమె  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు కూడా నమోదైంది. పొలం విషయమై అద్దంకి కోర్టులో సివిల్‌ దావా కూడా నడుస్తోంది. ఈ క్ర మంలో సుబ్బమ్మపై కక్ష పెంచుకొని హరిబాబు ఈ నెల 14వ తేదీ రాత్రి గురిజేపల్లి వచ్చాడు. సుబ్బమ్మ నిద్రిస్తుం డగా టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. చెవి కమ్మలు తీసుకొని పారిపోయాడు. 15వ తేదీ ఉదయం 8 గంటల వరకూ సుబ్బమ్మ నిద్రలేవకపోవటంతో బంధువులు వెళ్లి చూడగా ఆమె మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఆమె పెద్దకుమార్తె రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆమె భర్త హరిరావు నిందితుడని తేలింది. దీంతో ఆయ న్ను మంగళవారం కొమ్మాలపాడు వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన అద్దంకి సీఐ రాజేష్‌, సంతమాగులూరు ఎస్సై శివన్నారాయణను ఆయన అభినందించారు. 


Updated Date - 2022-02-23T06:05:06+05:30 IST