విద్యుత్‌ లైన్‌మన్‌ అక్రమాలపై గ్రామస్థుల నిరసన

ABN , First Publish Date - 2022-11-30T22:37:17+05:30 IST

ఒక మధ్యతరగతి ఇంటికి విద్యుత్‌ బిల్లు రూ.82 వేలు..మరో చిన్న కాకా హాటల్‌కు రూ. 52 వేలు..ఇంటిలో మీటరు రీడింగ్‌ తీస్తే బిల్లు ఇవ్వరు.. ఫోన్‌లో చూసుకోండి అని సమాదానం.. ఎక్కువ కరెంటు బిల్లు వస్తే బిల్లులో కొంత సెటిల్‌ చేయడం..రీడింగ్‌ తీయకుండానే ఎంతో కొంత బిల్లు పంపించడం..వంటి అక్రమాలకు గ్రామంలోని విద్యుత్‌ లైన్‌మన్‌ కారణమంటూ బుధవారం మండలంలోని వలపర్ల గ్రామస్తులు మార్టూరులో విద్యుత్‌ కార్యాలయం (ఏడీఏ ఆఫీసు వద్ద) కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

  విద్యుత్‌ లైన్‌మన్‌ అక్రమాలపై గ్రామస్థుల నిరసన

ఏడీఏకు వినతి పత్రం

మార్టూరు, నవంబరు 30: ఒక మధ్యతరగతి ఇంటికి విద్యుత్‌ బిల్లు రూ.82 వేలు..మరో చిన్న కాకా హాటల్‌కు రూ. 52 వేలు..ఇంటిలో మీటరు రీడింగ్‌ తీస్తే బిల్లు ఇవ్వరు.. ఫోన్‌లో చూసుకోండి అని సమాదానం.. ఎక్కువ కరెంటు బిల్లు వస్తే బిల్లులో కొంత సెటిల్‌ చేయడం..రీడింగ్‌ తీయకుండానే ఎంతో కొంత బిల్లు పంపించడం..వంటి అక్రమాలకు గ్రామంలోని విద్యుత్‌ లైన్‌మన్‌ కారణమంటూ బుధవారం మండలంలోని వలపర్ల గ్రామస్తులు మార్టూరులో విద్యుత్‌ కార్యాలయం (ఏడీఏ ఆఫీసు వద్ద) కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత రెండేళ్ల నుంచి గ్రామంలో లైన్‌మన్‌ చర్యలతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. మీటరు రీడింగ్‌ తీయకుండా ఇష్టం వచ్చిన విధంగా బిల్లులు వేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతినెలా కరెంటు బిల్లులు చెల్లిస్తున్నా గత నెలలో వేల రూపాయలు విద్యుత్‌ బిల్లులు చెల్లించాలంటూ కొంతమందికి మెసేజ్‌ లు వచ్చాయన్నారు. అంతేగాకుండా గ్రామంలో పాత కరెంటు మీటర్లు ఎక్కువగా ఉన్నాయని, వాటి ద్వారా స్కానింగ్‌ రాకపోవడంతో ఇష్టం వచ్చిన విధంగా బిల్లులు వేస్తున్నారని గ్రామస్థలు ఆరోపించారు. కొంతమంది కరెంటు బిల్లులు చెల్లించమని వ్యక్తిగతంగా లైన్‌మన్‌కు డబ్బులు చెల్లిస్తే వాటిలో గోల్‌మాల్‌ జరిగిందన్నారు. గ్రామంలోని విద్యుత్‌ సమస్యల పట్ల సీపీఎం నాయకులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఏడీఏ కార్యాలయం వద్దకు వచ్చారు. గ్రామంలో కరెంటు బిల్లులు సక్రమంగా రాలేదని, లైన్‌మన్‌ పై చర్యలు తీసుకోవాలని ఏడీఏ గురమయ్యకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన వారం రోజుల తర్వాత గ్రామంలో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తామన్నారు. సమస్య ఉన్న ప్రతి ఇంటి విద్యుత్‌ బిల్లును, కరెంటు మీటరును పరిలిస్తామన్నారు. తప్పుగా వచ్చిన బిల్లులను సరిచేస్తామని వారికి హామీ ఇచ్చారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.అయితే విద్యుత్‌ లైన్‌మన్‌ చర్యలపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్థులు గంజి హనుమయ్య, శివ పార్వతి. షేక్‌ అహమ్మద్‌ షరీ్‌ఫ,షేక్‌ ఫక్రుద్దీన్‌,కొండయ్య, మల్లికార్జునరావు, సురేష్‌, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:37:19+05:30 IST