గుప్త నిధుల దొంగలను పట్టుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-09-09T05:06:04+05:30 IST

మండలంలోని సీతానాగు లవరం సమీపంలోని కొండబోటు వద్ద గుప్త నిధుల కోసం వచ్చిన ముఠాను గ్రామస్థులు చుటు ముట్టి ప ట్టుకున్నారు.

గుప్త నిధుల దొంగలను పట్టుకున్న  గ్రామస్థులు
గుప్త నిధుల కోసం వచ్చిన దొంగలు (ఇన్‌సెట్‌లో) మిషన్‌

తర్లుపాడు, సెప్టెంబరు 8:  మండలంలోని సీతానాగు లవరం సమీపంలోని కొండబోటు వద్ద గుప్త నిధుల కోసం వచ్చిన ముఠాను గ్రామస్థులు చుటు ముట్టి ప ట్టుకున్నారు. సీతానాగులవరం బోటు వద్ద అను మానంగా ముగ్గురు వ్యక్తులను పొలానికి వెళ్లి వస్తున్న టి.శ్రీను, బి.ప్రసాద్‌ చూసి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు పక్కా ప్రణాళికతో 50 మం ది యువ కులు కొండబోటును చుట్టుముట్టి ఆ ము గ్గురినీ అదుపులోకి తీసుకొన్నారు. వీరివద్ద ఎలకా్ట్రనిక్‌ పరి కరం ఉన్నది.  బోటులో దుర్గమ్మ పురాతన ఆలయం ఉండడంతో గతంలో కూడా ఇక్కడ గుప్త నిధుల కోసం ఒక ముఠా తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు తెలి పారు.  గురువారం రాత్రి కూడా గుప్త నిధుల కోసం వ చ్చి తవ్వకాలు జరుపుతున్న సమయంలో గ్రామస్థులు ప ట్టుకున్నారు. ఈ విషయాన్ని సీతానాగులవరం గ్రామస్థులు తాడివారిపల్లె ఎస్‌ఐ ముక్కంటికి సమా చారం ఇవ్వడంతో ఎస్‌ఐ ముక్కంటి హుటాహుటిన సీతానాగులవరం చేరుకొని వారి వద్ద నున్న మిషన్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో వివరాలు తెలియాల్సి ఉంది. 


Read more