రేషన్‌ షాపుల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-12-06T23:30:02+05:30 IST

సంతమాగులూరు మండలం కొ ప్పరంలోని రెండు రేషన్‌ షాపులలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం త నిఖీలు నిర్వహించి 4975 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

రేషన్‌ షాపుల్లో విజిలెన్స్‌ తనిఖీలు

4975 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తింపు

కొప్పరం(అద్దంకి), డిసెంబరు 6: సంతమాగులూరు మండలం కొ ప్పరంలోని రెండు రేషన్‌ షాపులలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం త నిఖీలు నిర్వహించి 4975 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌ స్పెక్టర్‌ లక్ష్మారెడ్డి, విజిలెన్స్‌ తహసీల్దార్‌ నాగమల్లేశ్వరరావు, సివిల్‌ సప్ల యీస్‌ డీటీ శరత్‌ ఆధ్వర్యంలో మంగళవారం కొప్పరంలోని రెండు రేష న్‌ షాపులను తనిఖీ చేశారు. ఒక రేషన్‌ షాపులో 4265 కిలోల బి య్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రేషన్‌ డీలర్‌ గుంజి నాగలక్ష్మి, అదే షాపులో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న గుంజి గోపాలకృష్ణ కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరించి నల్ల బ జారుకు తరలిస్తున్నట్లు గుర్తించి సంతమాగులూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని డీటీ శరత్‌కు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌ స్పెక్టర్‌ లక్ష్మారెడ్డి సూచించారు.

మరో రేషన్‌ షాపులో 710 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి రేషన్‌ డీలర్‌ రామారావుపై 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ఇటీవల అద్దంకిలో నాలుగు రేషన్‌ షాపులకు రేషన్‌ బియ్యం సరఫరా కాకుండానే పక్కదారి పట్టడం, మంగళవారం సంతమాగు లూరు మండలం కొప్పరంలో రెండు రేషన్‌ షాపులలో బియ్యం నిల్వ లు తక్కువగా ఉన్నట్లు గుర్తించటం బట్టి నియోజకవర్గంలో పెద్ద ఎ త్తున రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడాన్ని తేటతెల్లం చేస్తుందని పలు వురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2022-12-06T23:30:11+05:30 IST