తుగ్లక్‌ పాలనను సాగనంపాలి

ABN , First Publish Date - 2022-10-08T06:25:49+05:30 IST

: రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్న తుగ్లక్‌ను పాలన నుంచి సాగ నంపాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

తుగ్లక్‌ పాలనను సాగనంపాలి
నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

నిరాహార దీక్షలో ఎరిక్షన్‌బాబు 

పెద్ద దోర్నాల, అక్టోబరు 7: రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్న తుగ్లక్‌ను పాలన నుంచి సాగ నంపాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక నటరాజ్‌ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద డా.. ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయానికి పేరు మార్పును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రిలేనిరాహార ధీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న అన్న ఎన్‌టీఆర్‌ పేరును విశ్వవిద్యాలయం నుంచి తొలగించి తండ్రి పేరును పెట్టుకున్న తుగ్లక్‌ జగన్‌రెడ్డి అని విమర్శించారు.ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల అభివృద్ధి కోసం కూడు, గూడు, గుడ్డకు ఇబ్బందులు పడకూడదని అనేక పథకాలు అమలుజేశారన్నారు. మహిళల కోసం ఆస్తిహక్కు, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన మహనీయుని పేరు తొలగించడం అమానుషమన్నారు. పిచ్చి జీవోలు అమలు చేసి కోర్టు ద్వారా మొట్టికాయలు తిన్న బుద్ధి రాలేదన్నారు.  ఇప్పటి వరకు పాలించిన ముఖ్యమంత్రులు ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఎవరూ చేయలేదన్నారు. అబద్దాల హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని దుయ్యబట్టారు. కార్యాలయాలకు రంగులు మార్చడం మినహా  ఆయన చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నారు. వైసీపీ అధికారంలో ఒక్క యూనివర్శిటీ కట్టింది లేద న్నారు. ఏమైనా అభివృద్ధి పనులు చేసి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవాలని ఆయన సూ చిం చారు. ఇప్పటికైనా పునరాలోచించి విశ్వవిద్యాయానికి ఎన్‌టీఆర్‌ పేరును కొనసాగించాలని కోరారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని, మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఎన్నాళ్లుగానో ఈ ప్రాంతం ప్రజలు కోరుతున్నాముఖ్యమంత్రి గానీ ఈ ప్రాంతం మంత్రి గానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజ లు వీటన్నింటిని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతా రన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్‌ మహబూబ్‌ భాష, బట్టు సుధాకర్‌రెడ్డి, షేక్‌ సమ్మద్‌భాష, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ భాష, కే.దానం, యలకపాటి చంచయ్య, కే శ్రీనివాసరావు, కే.రాజేంద్ర, వెచ్చా హరగోపాల్‌, కే చెన్నారెడ్డి, జడి.లక్ష్మయ్యపాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T06:25:49+05:30 IST