కందుకూరు మృతులకు ఘనంగా నివాళులు

ABN , First Publish Date - 2022-12-30T02:10:51+05:30 IST

కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సభ సందర్బంగా జరిగిన విషాద సంఘటనలో మృతిచెందిన పార్టీ కార్యకర్తలకు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

కందుకూరు మృతులకు ఘనంగా నివాళులు

ఒంగోలు, డిసెంబరు 29 (ఆంఽధ్రజ్యోతి) : కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సభ సందర్బంగా జరిగిన విషాద సంఘటనలో మృతిచెందిన పార్టీ కార్యకర్తలకు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గురువారం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ముఖ్యనేతలు స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి కుటుంబసభ్యులను పరా మర్శించి తక్షణ మట్టిఖర్చుల కోసం పార్టీ పరంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.50వేలు అందజేశారు. కందుకూరు సభకు జిల్లా మీదగా వెళ్ళిన అధినేత చంద్రబాబుకు జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు బుధవారం మధ్యాహ్నం ఘన స్వాగతం పలకడంతో పాటు ఆయన వెంటనే అక్కడికి వెళ్లారు సభ జరుగుతున్న సమయం లో జరిగిన విషాద సంఘటనలో ఏకంగా ఎని మిది మంది టీడీపీ కార్యకర్తలు మృతిచెందగా వారి పోస్టుమార్టం ప్రక్రియ గురువారం ఉద యం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి చేసి బంధువులకు అధికారులు అప్పగించారు. దీంతో వారి వారి గ్రామాల్లో వారి అంత్య క్రియలు జరిగాయి. కాగా ఈ ఘటనపై చర్చిం చిన చంద్రబాబు కందుకూరు సభను రద్దు చేసిన విషయం విదితమే. అనంతరం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలు అందరిని గురు వారం జరిగే అంత్యక్రియల్లో పాల్గొని కుటుం బాలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని సూచించారు. తదనుగుణంగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు ఆ కార్య క్రమాలకు హాజరయ్యారు. ఆ దుర్ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా ఏడు గురు కందుకూరు నియోజకవర్గానికి చెందిన వారు కాగా ఒకరు జిల్లాలోని కొండపి మండలం పెట్లూరుకు చెందిన మహిళా ఉన్నా రు. ఈ నేపథ్యంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డి ఉలవపాడులో ఎస్టీ మహిళ విజయ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి కుటుంబానికి పార్టీ ప్రకటించిన చెక్కును అందజేశారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, పార్టీ సీనియర్‌ నేత దామచర్ల పూర్ణచంద్రరావులు గురువారం పెట్లూరు వెళ్లి మృతిచెందిన రాజేశ్వరికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. అధినేత ఆదేశాలతో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్యెల్యే దామచర్ల జనార్దన్‌ కందు కూరు మండలం కొండముడుసుపాలెం వెళ్లి స్థానిక టీడీపీ సీనియర్‌ నేత కలవకూరి యానాది భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్‌ఎన్‌పాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్‌విజయకుమార్‌, డెయిరీ మాజీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావుతో కలిసి కందుకూరు మండలం ఓగూరు వెళ్లి గడ్డం మధు భౌతికకాయానికి నివాళులర్పిం చారు. గుడ్లూరు మండలం గుండ్లపాలెంకు చెందిన సీనియర్‌ నేత పురుషోత్తం ఈ ఘటన లో మృతిచెందగా వైపాలెం ఇన్‌చార్జీ గూడూరి ఎరిక్షన్‌బాబు అక్కడకు వెళ్ళి కుటుంబ సభ్యుల ను ఓదార్చారు. ఈ ఘటనలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించేం దుకు ఒక్కొక్క కుటుంబానికి రూ.30 లక్షలు మేర ఆర్థిక సాయం అందించనున్నారు. ఇదిలా ఉండగా కావలిలో జరగనున్న చంద్రబాబు పర్యటనలో జిల్లాకు చెందిన యువనేత దామచర్ల సత్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T02:10:53+05:30 IST