రేంజ్‌లో ఐదుగురు సీఐల బదిలీ

ABN , First Publish Date - 2022-06-07T06:42:43+05:30 IST

గుంటూరు రేంజ్‌ పరిధిలో ఐదుగురు సీఐలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీఐజీ త్రివిక్రమవర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

రేంజ్‌లో ఐదుగురు సీఐల బదిలీ

జిల్లాలో పనిచేస్తున్న  ఇద్దరికి స్థాన చలనం 

ఒంగోలు క్రైం, జూన్‌ 6: గుంటూరు రేంజ్‌ పరిధిలో ఐదుగురు సీఐలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీఐజీ త్రివిక్రమవర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులో మన జిల్లాలో ఇద్దరు ఉన్నారు. దర్శి సీఐ ఎం.భీమానాయక్‌ను మార్కాపురం బదిలీ చేశారు. రేంజ్‌ ఆఫీస్‌లో ఉన్న జె.రామకోటయ్యను దర్శి సర్కిల్‌కు నియమించారు. మార్కాపురంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఐ.ఆంజనేయరెడ్డిని రేంజ్‌ ఆఫీసుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 


Read more