-
-
Home » Andhra Pradesh » Prakasam » Train to Tirupati from today-MRGS-AndhraPradesh
-
నేటి నుంచి తిరుపతికి రైలు
ABN , First Publish Date - 2022-08-18T04:11:47+05:30 IST
గిద్దలూరు ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు ఈనెల 18వ తేదీ నుంచి రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

గిద్దలూరు టౌన్, ఆగస్టు 17 : గిద్దలూరు ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు ఈనెల 18వ తేదీ నుంచి రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. 17261 నెంబరుతో గుంటూరు-గిద్దలూరు-తిరుపతి, 17262 నెంబరుతో తిరుపతి-గిద్దలూరు-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం నుంచి దక్షిణ మధ్య రైల్వే నడుపనున్నది. ప్రతిరోజు గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు రైలు బయలుదేరి నర్సరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, పొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుంది. తిరుపతిలో రాత్రి 7.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8గంటలకు గుంటూరుకు చేరుతుంది.