ప్రైవేటు బస్సు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-04-24T07:51:27+05:30 IST

రోడ్డుపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తులిపి కోటేశ్వరరావు (50) మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మండల పరిధిలోని నందనమారెళ్ల జాతీయ రహదారిపై జరిగింది.

ప్రైవేటు బస్సు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

కనిగిరి, ఏప్రిల్‌ 23: రోడ్డుపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తులిపి కోటేశ్వరరావు (50) మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మండల పరిధిలోని నందనమారెళ్ల జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు నుంచి కనిగిరి మీదుగా మార్కాపురానికి సరివి కర్రల లోడుతో ట్రాక్టర్‌ వెళుతోంది. అదే రోడ్డులో కడప నుంచి విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు వెళుతోంది. ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ట్రావెల్‌ బస్సు ప్రమాదవశాత్తు ఢీ కొంది. దీంతో  ఒక్కసారిగా సరివి కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ రోడ్డుపై తిరగబడింది. దీంతో సరివి కర్రలు పైన బడటంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. బస్సు ముందు భాగం అద్దం పగిలింది. బస్పులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ప్రయాణీకులను వెనుక అదే ట్రావెల్‌కు చెందిన మరో బస్సుల్లో ఎక్కించి వారి గమ్యస్థానాలకు తరలించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

Read more