మేలు రకం వైపే

ABN , First Publish Date - 2022-04-06T05:06:55+05:30 IST

పొగాకు మార్కెట్‌ లో వ్యాపారులు ప్రారంభం నుంచి ఒకే విధానా న్ని అనుసరిస్తున్నారు. మేలు రకం గ్రేడ్‌లను మా త్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇతర రకాలను తి రస్కరిస్తున్నారు. రోజురోజుకూ నోబిడ్‌లు పెరిగి పోతున్నాయి.

మేలు రకం వైపే


పొగాకు మార్కెట్‌లో మారని వ్యాపారుల తీరు

ఇతర రకాలు నోబిడ్‌తో ఆందోళనలో రైతులు 

189 బేళ్ల తిరస్కరణ


టంగుటూరు, ఏప్రిల్‌ 5 : పొగాకు మార్కెట్‌ లో వ్యాపారులు ప్రారంభం నుంచి ఒకే విధానా న్ని అనుసరిస్తున్నారు. మేలు రకం గ్రేడ్‌లను మా త్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇతర రకాలను తి రస్కరిస్తున్నారు. రోజురోజుకూ నోబిడ్‌లు పెరిగి పోతున్నాయి. దీంతో రైతులు కలవరపడుతున్నా రు. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆకు నాణ్యత, బరువు మ రింత తగ్గి తాము నష్టపోతామని వారు ఆందోళ న చెందుతున్నారు. 

టంగుటూరు కేంద్రంలో గత నెల 28న పొగా కు వేలం ప్రారంభమైంది. వారం నుంచి వ్యాపా రులు నాణ్యమైన బేళ్లను మాత్రమే కొనుగోలు చే స్తున్నారు. ఎఫ్‌-1, ఎఫ్‌-2 వంటి బ్రైట్‌ గ్రేడ్‌లు మినహా ఇతర గ్రేడ్లను వ్యాపారులు తిరస్కరిస్తు న్నారు. దీంతో రోజూ వేలం కేంద్రంలో నోబిడ్లు అ ధికమవుతున్నాయి. వ్యాపారుల విధానం చూస్తు న్న రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోగ్రేడ్లు, మీడియం గ్రేడ్లను ఎప్పటి నుంచి కొ నుగోలు చేస్తారో, వీటికి ధరలు ఏవిధంగా చెల్లి స్తారో అని అనుమానిస్తున్నారు.  

 ఈఏడాది ఎండల ప్రభావం అధికంగా ఉంది. మార్చి నుంచి తీవ్రత పెరిగింది. ఈపరిస్థితుల్లో ఇతర గ్రేడ్ల కొనుగోళ్లలో జాప్యం జరిగితే పొగాకు నాణ్యత, బరువు తగ్గే అవకాశం ఉంది. దీంతో న ష్టపోతామన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోం ది.  ఈ నేపథ్యంలో నాణ్యమైన పొగాకుతోపాటు ఇతర గ్రేడ్లను గిట్టుబాటు ధరలు చెల్లించి కొనుగో లు చేయాలని రైతులు కోరుతున్నారు. వ్యాపారు ల పోకడపై గత శుక్రవారం పొందూరు రైతులు  నిరసన వ్యక్తం చేశారు. కొనుగోళ్లను నిలిపివేసి నోబిడ్లపై తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఇ రువర్గాలతో అధికారులు చర్చించి కొనుగోళ్లు పు న:ప్రారంభించినా వ్యాపారులు తమ పంథానే కొ నసాగిస్తున్నారు.  

వేలం కేంద్రానికి మంగళవారం దావగూడూ రు, చింతలపాలెంల రైతులకు చెందిన 724 బేళ్ల కు అనుమతించారు. వాటిలో 529 బేళ్లను వ్యా పారులు కొనుగోలు చేశారు. 189 తిరస్కరించా రు. అందులో 163 నోబిడ్లు అయ్యాయి. 12 ఆర్‌, 14 బేళ్లు సీఆర్‌ అయ్యాయి. గరిష్ఠ ధర కిలోకు రూ.185, కనిష్ఠ ధర రూ.180 పలికింది.


Updated Date - 2022-04-06T05:06:55+05:30 IST