నాడు - నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-06-08T05:15:18+05:30 IST

రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదలైన స్కూళ్లల్లో వెంటనే పను లను పూర్తి చేయాలని డీఈవో పీవీజే రామారావు అన్నారు.

నాడు - నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
నాడు- నేడు పనులపై సమీక్ష చేస్తున్న డీఈవో రామారావు తదితరులు

మార్టూరు, జూన్‌ 7: రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదలైన స్కూళ్లల్లో వెంటనే పను లను పూర్తి చేయాలని డీఈవో పీవీజే రామారావు అన్నారు. మంగళవారం స్థానిక  మండల విద్యాశాఖ కార్యాలయంలో నాడు-నేడు (పేజ్‌2) పనులకు సంబంధించి 9 మండలాలకు చెందిన అధికారులతో డీఈవో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ  నాడు - నేడు కింద మం జూరయిన పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇం జనీరింగ్‌ అధికారులను సమన్వయం చేసుకుంటూ  నిర్మాణ పనులు వేగవంతం గా పూ ర్తయ్యే విధంగా పనిచేయాలన్నారు. వారికి ఎలాంటి సెలవులు లేవన్నారు. రోజూ స్కూలుకు వచ్చి పనులను పర్య వేక్షించాలన్నారు.  స్కూల్‌ కాంప్లెక్స్‌ కు చెందిన ప్రధానోపాధ్యాయులు వారి పరిఽఽధిలోని పాఠశాలల పనులను పర్యవేక్షించా లన్నారు. నాడు - నేడు పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చ ర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో మార్టూరు,  ఇంకొల్లు, పర్చూరు, య ద్దనపూడి, పంగులూరు, అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు, సంతమాగులూరు మం డలాలకు చెందిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T05:15:18+05:30 IST