దోచుకోవడం, దాచుకోవడమే వైసీపీ పని: ఇంటూరి నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2022-03-17T04:30:03+05:30 IST

రాష్ట్రంలోని ప్రకృతి సహజ సిద్ధమైన సంపదను దోసుకోవడం-దాచుకోవడమే వైసీపీ ప్రభుత్వం అజెండాగా పెట్టుకుందని టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. మండలంలోని బద్దిపూడి గ్రామంలోని మన్నేరులో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో ఇటీవల భారీగా ఇసుక కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక దళితులతో కలిసి ఇసుక తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు.

దోచుకోవడం, దాచుకోవడమే వైసీపీ పని: ఇంటూరి నాగేశ్వరరావు
మన్నేరులో ఇసుకు తవ్విన ప్రదేశంలో విలేఖర్లతో మాట్లాడుతున్న ఇంటూరి

- టీడీపీ కందుకూరు నియోజకవర్గ  ఇన్‌చార్జి ఇంటూరి 

బద్ధిపూడి(ఉలవపాడు), మార్చి 16 : రాష్ట్రంలోని ప్రకృతి సహజ సిద్ధమైన సంపదను దోసుకోవడం-దాచుకోవడమే వైసీపీ ప్రభుత్వం అజెండాగా పెట్టుకుందని టీడీపీ కందుకూరు నియోజకవర్గ  ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. మండలంలోని బద్దిపూడి గ్రామంలోని మన్నేరులో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో ఇటీవల భారీగా ఇసుక కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక దళితులతో కలిసి ఇసుక తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ...జగన్‌రెడ్డి ప్రభుత్వం బరితెగించి మైనింగ్‌ దోపిడీ చేస్తున్నదని, దీనిలో భాగంగా ఆ దోపిడీ ముఠా బద్దిపూడి మన్నేరులో తిష్ఠవేసి పది రోజుల్లో 30 అడుగుల లోతు మేర రూ. కోటి పైన విలువ చేసే ఇసుకను తవ్వేశారని  ఆరోపించారు. స్ధానిక నాయకులకు తెసినా ఇసుక మాఫియాను అడ్డుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రెండు రోజు క్రితం గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో ఒకరి పొలంలోని మట్టిని తరలిస్తుంటే అక్రమ మైనింగ్‌ అంటూ ట్రాక్టర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసిన సెబ్‌ అధికారులు బద్దిపూడిలో జరిగిన ఇసుక దోపిడీకి ఇదే తరహా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇకపై నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలను టీడీపీ ముందుండి అడ్డుకట్ట వేస్తుందని, అక్రమార్కుల ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో కార్యకర్తలతో ఆత్మీయ పరిచయం కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు జైజై నినాదాల మధ్య ఇంటూరికి సాదర స్వాగతం పలికి  పల్లెల్లోకి ఆహ్వానించారు. ఇంటూరితోపాటుగా ఎస్సీ సెల్‌ జిల్లా నాయకుడు జీ మోషే, బెజవాడ ప్రసాద్‌, దామా మల్లేశ్వరరావు, నాదెండ్ల భాస్కర్‌, పొడపాటి మహేష్‌, బద్దిపూడి గ్రామపార్టీ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, పార్టీ నాయకులు వెంకటరామిరెడ్డి, డమ్ము రవికుమార్‌, రమణ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Read more