కార్పొరేషన్‌ బడ్జెట్‌కు రూ. 150 కోట్లతో ప్రతిపాదనలు..!

ABN , First Publish Date - 2022-12-13T00:11:07+05:30 IST

ఒంగోలు నగరపాలక సంస్థ సాధారణ బడ్జెట్‌పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనరు ఎం. వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్‌ చాంబర్‌లో వివిధ సెక్షన్‌ హెడ్‌లతో సమావేశం నిర్వహించిన ఆయన 2022-2023 ఏడాది ఆదాయం, ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కార్పొరేషన్‌ బడ్జెట్‌కు   రూ. 150 కోట్లతో  ప్రతిపాదనలు..!

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 12 : ఒంగోలు నగరపాలక సంస్థ సాధారణ బడ్జెట్‌పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనరు ఎం. వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్‌ చాంబర్‌లో వివిధ సెక్షన్‌ హెడ్‌లతో సమావేశం నిర్వహించిన ఆయన 2022-2023 ఏడాది ఆదాయం, ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాబోయే ఆర్థిక సంవత్సరం 2023-2024 ఏడాదికి సంబంధించి రూ. 150 కోట్లకు అంచనాలు సిద్ధం చేయాలని కమిషనరు ఆదేశించారు. ఈ ప్రక్రియ వారం రోజులలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ కే. వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ ఇంజనీర్‌ డి.మాల్యాద్రి, అసిస్టెంట్‌ కమిషనరు వీరాంజనేయులు, ఆర్‌వోలు మధు, ఉదయభాస్కర్‌తోపాటు డీఈలు పలువురు పాల్గొన్నారు.

కమిషనరు ‘స్పందన’కు ఏడు అర్జీలు

నగరసమస్యలపై కమిషనరు ఎం. వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి ఏడు అర్జీలు అందాయి. దీనిపై వారం రోజుల్లో పరిష్కార నివేదిక ఇవ్వాలని కమిషనరు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇకపై ప్రతి సోమవారం కమిషనరు చాంబర్‌లో ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల ఆయా డివిజన్‌లలో విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని తెలిపారు.

Updated Date - 2022-12-13T00:11:09+05:30 IST