ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

ABN , First Publish Date - 2022-05-18T06:27:05+05:30 IST

ఏపీ ఓపెన్‌ స్కూలు సొసైటీ ఇంటర్‌ పరీక్షల్లో మంగళవారం మార్కాపురంలోని ఓ కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేసినట్లు డీఈవో బి.విజయభాస్కర్‌ తెలిపారు.

ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల్లో  ముగ్గురు డిబార్‌

ఒంగోలు(విద్య), మే 17 : ఏపీ ఓపెన్‌ స్కూలు సొసైటీ ఇంటర్‌ పరీక్షల్లో మంగళవారం మార్కాపురంలోని ఓ కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేసినట్లు డీఈవో బి.విజయభాస్కర్‌ తెలిపారు. మంగళవారం జరిగిన ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలకు మొత్తం 4,605 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 700మంది గైర్హాజరయ్యారు. స్క్వాడ్‌ అధికారులు ఎనిమిది కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో తెలిపారు. కాగా ఇంటర్‌ రెగ్యులర్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2కు 28,197మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో సైమన్‌ విక్టర్‌ తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 29,734 మంది హాజరుకావాల్సి ఉండగా 1,537 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐవో వై.పాలెం, మార్కాపురం, త్రిపురాంతకం కేంద్రాలను సందర్శించారు. స్క్వాడ్‌ అధికారులు 40 కేంద్రాలను సందర్శించినట్లు ఆర్‌ఐవో తెలిపారు. 
Read more