అటవీ, కుటుంబ సంరక్షణ ఉండాలి

ABN , First Publish Date - 2022-09-12T04:34:16+05:30 IST

అటవీ సంరక్షణతో పాటు కుటుంబ బాధ్యతను మరిచిపోవద్దని కనిగిరి ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ కే రామిరెడ్డి అ న్నారు.

అటవీ, కుటుంబ సంరక్షణ ఉండాలి
అమరవీరులకు నివాళులర్పిస్తున్న అటవీశాఖ అధికారులు


కనిగిరి, సెప్టెంబరు 11 : అటవీ సంరక్షణతో పాటు కుటుంబ  బాధ్యతను మరిచిపోవద్దని కనిగిరి ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ కే రామిరెడ్డి అ న్నారు. కార్యాలయ అవరణలో అటవీ శాఖ అమరవీరుల జాతీయ సం స్మరణ దినోత్సవం సందర్బంగా అమరవీరులకు ఆదివారం  నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణలో ప్రాణాలకు తెగించి ఒంటరిగా కూంబింగ్‌కు వెళ్లొద్దన్నారు.  మార్కాపురం డివిజన్‌ ఫారెస్ట్‌ పరిధిలో 1992 నాటి ఘటనను గుర్తు చే శారు. అటవీ దొంగలు వెంటాడి ఫారెస్ట్‌ అధికారులను చంపిన  విష యాన్ని గుర్తు చే శారు. పులులను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లే ఫారెస్ట్‌ అధికా రులను క్రూరమృగాల కన్నా ప్రమాదకరమైన మనిషి రూపంలో ఉన్న అటవీ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.  అటవీ సంపదను సంరక్షించటంతో అడవి దొంగలను వలపన్ని పట్టు కోవాలని సూచించా రు. కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ తులసీరావు, ఎం. వెంకటసుబ్బయ్య, ఎం.రెడ్యానాయక్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారులు, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more