బస్టాండ్‌లో కుప్పకూలి చనిపోయిన యువకుడు

ABN , First Publish Date - 2022-05-19T05:21:26+05:30 IST

తాళ్లూరు బస్టాండ్‌ సెంటర్‌లోని నాగయ్య కాంప్లెక్స్‌ వద్ద శివరామపురం గ్రామానికి చెందిన ఓ యువకు డు బస్‌ కోసం నిరీక్షిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెం దాడు.

బస్టాండ్‌లో కుప్పకూలి చనిపోయిన యువకుడు
మృతదేహాన్ని వాహనంలో తరలిస్తున్న ఎస్సై

దర్శి ఆస్పత్రికి వెళ్లివస్తుండగా తాళ్లూరులో ఘటన

మృతదేహాన్ని గ్రామానికి తరలించిన ఎస్సై

తాళ్లూరు, మే 18: తాళ్లూరు బస్టాండ్‌ సెంటర్‌లోని నాగయ్య కాంప్లెక్స్‌ వద్ద శివరామపురం గ్రామానికి చెందిన ఓ యువకు డు బస్‌ కోసం నిరీక్షిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెం దాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శివరామపురానికి చెందిన ముప్పనేని కనకశ్రీను(38) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తల్లితో కలిసి దర్శి ప్రభుత్వాస్పతికి వె ళ్లాడు. వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు తాళ్లూరు చేరుకున్నారు. నాగయ్య కాంప్లెక్స్‌ వద్ద శివరామపురం వెళ్లేందుకు బస్‌కోసం ఎదురుచూస్తూ అరుగుపై కూర్చున్నాడు. ఉన్నట్లుండి ఒక్కసారిగా వెనక్కి కూలబడిపోయాడు. సమీప ప్రజలు వెళ్లి చూడగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరసింహారావు అక్కడకు చేరున్నారు. మృతుని తల్లిని అడిగి వివరాలు తెలుసుకుని గ్రా మంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు.   ఓ వాహనాన్నీ సమకూర్చి మృతదేహాన్ని దగ్గరుండి శివరామపురం తరలించారు. స్పందించిన ఎస్సై తీరును ప్రజలు అభినందించారు.

Read more