క్వారీ గుంతలోకి దిగి యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2022-05-30T05:51:49+05:30 IST

క్వారీ నీటి గుంతలో పడి యువకుడు గల్లంతైన సంఘటన బల్లిపల్లి అడ్డరోడ్డు సమీపంలోని బాలవెంకటాపురం క్వారీలో ఆదివారం జరిగింది.

క్వారీ గుంతలోకి దిగి యువకుడి గల్లంతు
గుంటను పరిశీలిస్తున్న ఎస్‌ఐ ప్రసాద్‌

కనిగిరి, మే 29 : క్వారీ నీటి గుంతలో పడి యువకుడు గల్లంతైన సంఘటన బల్లిపల్లి అడ్డరోడ్డు సమీపంలోని బాలవెంకటాపురం క్వారీలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బాలవెంకటాపురం గ్రా మానికి చెందిన శెట్టిపల్లి సూర్య ఈత కోసం మరో ముగ్గురు స్నేహి తులతో కలసి వెళ్లాడు. ఈత కొడుతుండగా సూ ర్య నీటిలో మునిగి పో యాడు. ఎంత సేపటికీ బయటికి రాక పోవ డంతో తోటి స్నేహితులు గ్రామంలోని ప్రజలకు, వారి బంధువులకు చెప్పారు. దీంతో సమాచారం తె లుసుకున్న ఎస్‌ఐ దాసు ప్రసాద్‌ సంఘటనా స్థలా నికి చేరుకుని, గల్లంతైన యువకుడిని గుర్తిం చేందుకు చర్యలు చే పడుతున్నారు. యువ కుడు మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read more