వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T07:28:07+05:30 IST

పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువుతో తాగు, సాగు నీటి కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఏదురు చూస్తున్నారని శాశ్వతంగా కరువును తరిమికోట్టేందుకు వెలిగొండ ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌బాబు డి మాండ్‌ చేశారు.

వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
కరపత్రం అందజేస్తున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు

పుల్లలచెరువు, అక్టోబరు 1: పశ్చిమ ప్రాంతంలో  తీవ్ర కరువుతో తాగు, సాగు నీటి కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఏదురు చూస్తున్నారని శాశ్వతంగా  కరువును  తరిమికోట్టేందుకు వెలిగొండ ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని  ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌బాబు డి మాండ్‌ చేశారు. శనివారం మండలంలోని రాచకొండ పంచాయతీలోని సుద్దకురువ తాండలో  బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత  టీడీపీ ప్రభుత్వ హాయంలో 24 గంటలు  నాణ్యమైన విద్యుత్‌ సరాఫరా చేస్తే నేడు ప్రజలపై చార్జీల భారం మోపుతున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ పూర్తయినా, ఇప్పటికీ రెండవ సొరంగం పేరుతో పనుల్లో కాలాయాపన జరుగుతోందన్నారు. పుల్లలచెరువుకు ప్రధాన రోడ్డు గుంతల మయంగా ఉండి, రాకపోకలకు నిత్యం ప్రజలు అవస్ధలు పడుతున్న ప్రభుత్వం కనిసం పట్టించుకోవడం లేదని అన్నారు. సుగాలిల కోరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం అమలు చేయడం లేదని అన్నారు. పంచాయతీలకు నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. కార్యక్రమంలో  టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, కాకర్ల కోటయ్య,  కోట.డేవిడ్‌, హనుమంతు నాయక్‌, మాజీ సర్పంచి వేముల క్రిష్ణయ్య, నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more