మహిళాభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-12T03:46:12+05:30 IST

మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

మహిళాభివృద్ధే ధ్యేయం

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య 

మేదరమెట్ల, అక్టోబరు 11 :  మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శాప్‌నెట్‌ చైర్మన్‌,  వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం మండలంలోని పాసంగులపాడులో గడపగడపకు  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. నాడు-నేడుతో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  కార్యక్రమంలో కొరిశపాడు ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, ఎంపీడీవో సురేష్‌ బాబు, సర్పంచ్‌ చేజర్ల వెంకటరమణ, వైసీపీ మండల కన్వీనర్‌ సాధినేని మస్తాన్‌ రావు, పెన్నక శ్రీను, యర్రమనేని రవిచంద్ర, మావిళ్లపల్లి రమేష్‌, పలు గ్రామాల నా యకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. 


Read more