ఇచ్చేది తక్కువ.. లాక్కొనేది ఎక్కువ!

ABN , First Publish Date - 2022-05-18T05:57:23+05:30 IST

సంక్షేమ పథకాల పేరుతో పేదలకు అ రకొర లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం పన్నుల భారం మోపి, నిత్యావసర ధరలు పెంచి ఇచ్చినదానికంటే రెం డింతలు లాగేసుకుంటున్న దని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి విమర్శిం చారు.

ఇచ్చేది తక్కువ.. లాక్కొనేది ఎక్కువ!వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే స్వామి విమర్శ


కొండపి, మే 17 : సంక్షేమ పథకాల పేరుతో పేదలకు అ రకొర లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం పన్నుల భారం మోపి, నిత్యావసర ధరలు పెంచి ఇచ్చినదానికంటే రెం డింతలు లాగేసుకుంటున్న దని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి విమర్శిం చారు. పార్టీ పిలుపు మేరకు మంగళవారం మండలంలోని తాటాకులపాలెంలో నిర్వహి ంచిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంతోపాటు, ఎస్సీ కాలనీలో ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాల గురించి వివరించారు. గ్రామంలోని కూడళ్లలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రాయయ్య, మండల అధ్యక్షుడు బొడ్డపాటి యలమందనాయుడు, రైతు విభాగం అధ్యక్షుడు నరసారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రావిపాటి మధుసూదన్‌రావు, టీడీపీ నాయకులు బి.సోమయ్య, ఎం.సుబ్బరామయ్య, మన్నెం వెంకటేశ్వర్లు, రామా రావు, ప్రసాద్‌, అనుబంధ విభాగాల నాయకులు రవికుమార్‌, బి.కిరణ్‌ పాల్గొన్నారు


Read more