రాక్షస పాలనకు త్వరలోనే చరమగీతం

ABN , First Publish Date - 2022-08-26T04:59:15+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు.

రాక్షస పాలనకు త్వరలోనే చరమగీతం

కొండపి ఎమ్మెల్యే స్వామి

కాగడాల ప్రదర్శన


కొండపి, ఆగస్టు 25: రాష్ట్రంలోని వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. గురువారం రాత్రి కొండపిలో ఆయన కుప్పం ఘటనకు నిరసనగా నల్లబ్యాడ్జీ, నల్లచొక్కా ధరించి కాగడాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రేణులు కూడా నల్లబ్యాడ్జీలు, కాగడాలతో కొండపిలోని టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌సెంటర్‌లోని ఎన్టీఆర్‌ బొమ్మ సెంటర్‌ వరకు ఎమ్మెల్యే వెంట నడిచారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే పార్టీ టీడీపీఅని, పేదలకు మేలు చేయలేని వైసీపీ ప్రభుత్వం, నాయకులు టీడీపీపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి జగన్‌, రాష్ట్ర డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని ఈసందర్భంగా డిమాండ్‌ చేశారు. పోలీసులు కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ర్యాలీ సందర్భంగా అసమర్ధ సీఎం డౌన్‌.. డౌన్‌, వైసీపీ రాక్షస పాలన తరిమికొట్టాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, టీడీపీ నాయకులు మూలె రామారావు, చింతల వెంకట్రావు, బొద్దులూరి మోహన్‌, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఖాఈషా, నేతి రవికుమార్‌, తెలుగు మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రావిపాటి సీతమ్మ పాల్గొన్నారు. 


Read more