వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలి

ABN , First Publish Date - 2022-10-05T03:09:39+05:30 IST

వైసీపీ రాక్షస పాలనను ప్రజలే అంతమొందించేలా సమాయత్తం కావాలని టీడీపీ నాయకులు అన్నారు.

వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలి
అమ్మవారి చిత్రపటానికి మొక్కుతున్న నాయకులు

దుర్గామాతకు మొక్కులు

ఎన్టీఆర్‌ పేరు మార్పు దుర్మార్గం

రిలే దీక్షా శిబిరంలో కూర్చున్న పీసీపల్లి నాయకులు

కనిగిరి, అక్టోబరు 4 : వైసీపీ రాక్షస పాలనను ప్రజలే అంతమొందించేలా సమాయత్తం కావాలని టీడీపీ నాయకులు అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం వైద్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును  తొలగిస్తూ జగ న్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  టీడీపీ పీసీపల్లి మండల నాయకులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. జగన్‌రెడ్డి ఆలోచనలు, తీరులో మంచి మార్పులు రావాలని కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దుర్గా మాత చిత్రపటానికి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కుతీర్చారు.  ఈ సందర్భంగా పలువురు నా యకులు మాట్లాడుతూ లోక కంఠకుడైన మహిషాసురిడిని దుర్గామాత సంహరించి లోకానికి విముక్తి కల్గిం చినట్టుగా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతి ఒక్కరూ దుర్గలు మారాలన్నారు.  కార్యక్రమంలో నాయ కులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, నారపరెడ్డి(యడవల్లి) శ్రీనివాసులరెడ్డి, పీసీపల్లి మండల నాయకులు వేమూ రి రామయ్య, ఏనుగంటి తిరుపతయ్య, చల్లా సుధీర్‌, పువ్వాడి బ్రహ్మయ్య, నెలకుర్తి మల్లికార్జున, మాల్యాద్రి, వేమూరి సుబ్బరాయుడు, బండారు శ్రీను, ఓబులురెడ్డి, చల్లా సుధీర్‌, గోనుగుంట్ల చెన్నయ్య,  నాగోతు శ్రీను, గోపిశెట్టి శివప్రసాద్‌, కుక్కపల్లి బాలయ్య, మోతుకూరి శ్రీను, పూజల ఆంజనేయులు పాల్గొన్నారు. 


Read more